
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ ‘గోడం’
ఆదిలాబాద్: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీ లో కలిశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లోని పలు అభివృద్ధి పనుల విషయంపై వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం, కాజిపేట–హౌరా వయా మంచిర్యాల, కాగజ్‌నగర్ రైలు, ఆదిలాబాద్‌లోని ఎల్‌సీనంబర్ 29, 30 మార్పుపై విన్నవించారు. అలాగే కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ రైలు ఆపితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కోరారు. ఈ అంశాలపై మంత్రి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీ వివరించారు.