
‘ఉపాధి’ బీమా.. కూలీలకు ధీమా
● ఏడాదికి రూ.20 ప్రీమియం మాత్రమే.. ● ‘పీఎంఎస్‌బీవై’ అమలుకు యంత్రాంగం కసరత్తు
కైలాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పనులకు హాజరయ్యే కూలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు డీఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఉపాధిహామీ ఏపీవోలు, టెక్నికల్,ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. బీమా సౌకర్యం క ల్పనకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దే శం చేశారు. రూ.20 ప్రీమియం చెల్లింపుతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) కింద రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు.
ఉద్దేశమేంటి...
గ్రామీణ ప్రాంతాల కూలీలకు స్థానికంగానే వంద రోజుల పాటు పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే పనులకు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదాలతో పాటు పని ప్రదేశాల్లోనూ ప్రమాదాలకు ఆస్కా రం ఉంటుంది. ప్రమాదవశాత్తు కూలీ మృతి చెందితే ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుంది. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పనులకు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికి పైగా ఉపాఽధి కూలీలు దుర్మరణం చెందారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూలీ కు టుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పీఎంఎస్‌బీవై పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఏడాదికి రూ.20 మాత్రమే..
ఉపాధి జాబ్‌కార్డు కలిగి 18 నుంచి 70 ఏళ్లలోపు కూ లీలు ఈ పథకానికి అర్హులు. ఏదైనా జాతీయ బ్యాంకు లేదాపోస్టాఫీసు ఖాతా (ఆధార్‌కార్డు అనుసంధా నం) కలిగి ఉండాలి. ఈ పథకం కింద లబ్ధి కోసం కూలీలు కేంద్ర నిర్దేశిత రాతపూర్వక అభ్యర్థనతో పా టు ఏటా తమ ఖాతా నుంచి రూ.20 ప్రీ మియం చెల్లించడానికి అనుమతనిస్తు కన్సంట్ లేఖను ఏంపీడీవో, ఉపాధి హామీ ఏపీవోలకు అందజేయాల్సి ఉంటుంది. ఒక జాబ్ కార్డులో ఎంతమంది కూలీలు ఉంటే అంతమంది లేఖలు అందించాలి. తద్వారా ఏటా ప్రీమియంను అధికారులు ఆటోమెటిక్‌గా కూ లీల ఖాతా నుంచి డెబిట్ చేసుకుని పథకాన్ని వర్తింపజేయనున్నారు. బ్యాంకులు ఇప్పటికే ఈ పథకా న్ని అమలు చేస్తున్నప్పటికీ జిల్లాలో అనేక మంది కూలీలకు వర్తించడం లేదు. అలాంటి వారికి లబ్ధి చే కూర్చే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
లబ్ది ఇలా..
రూ.20 ప్రీమియం చెల్లించి పీఎంఎస్‌బీవై కింద నమోదు చేసుకున్న కూలీలు ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందినట్‌లైతే ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. అలాగే శాశ్వత వైకల్యం కలిగిన కూడా అదే మొత్తాన్ని అందించనున్నారు. పాక్షిక వైకల్యానికి గురైనట్‌లైతే వారికి రూ.లక్ష సాయం అందించనున్నారు.
జిల్లాలో..
ఉపాధి జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు : 1.74 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు : 1.01 లక్షలు
నమోదు చేసుకున్న కూలీలు : 3.44లక్షలు
పనులకు హాజరయ్యే కూలీలు : 2.06 లక్షలు
రూ.20 ప్రీమియంతోనే బీమా
ఉపాఽధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు పీఎంఎస్‌బీవై పథకాన్ని అమలు చేయాలని ఆదేశిస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లింపునకు గాను కూలీలు అంగీకార లేఖలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఏపీవోలు, పీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు అవగాహన కల్పించాలి.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో