● ఉండీ లేనట్టుగా శాఖా వ్యవహారం ● జిల్లా అధికారి సస్పెన్షన్‌తో లోపాలు బహిర్గతం ● రైతుల దరిచేరని సంక్షేమ పథకాలు ● తగ్గిన కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తీర్ణం ● లక్ష్యాల సాధనలోనూ వెనుకంజ | - | Sakshi
Sakshi News home page

● ఉండీ లేనట్టుగా శాఖా వ్యవహారం ● జిల్లా అధికారి సస్పెన్షన్‌తో లోపాలు బహిర్గతం ● రైతుల దరిచేరని సంక్షేమ పథకాలు ● తగ్గిన కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తీర్ణం ● లక్ష్యాల సాధనలోనూ వెనుకంజ

Jul 23 2025 7:02 AM | Updated on Jul 23 2025 7:02 AM

● ఉండీ లేనట్టుగా శాఖా వ్యవహారం ● జిల్లా అధికారి సస్పెన్

● ఉండీ లేనట్టుగా శాఖా వ్యవహారం ● జిల్లా అధికారి సస్పెన్

ఈ శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారిగా ఉన్న సుధాకర్‌ ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కార్యాలయానికి ఎవరైనా వెళితే.. జిల్లా అధికారి సస్పెన్షన్‌ వ్యవహారాన్ని దాచిపెడు తూ బదిలీపై వెళ్లారని ఉద్యోగులు పేర్కొనే పరిస్థితి ఉంది. విషయం తెలిసిన వారు సస్పెన్షన్‌కు గురైనట్లు తెలుస్తుందంటే.. అప్పుడు వారు ఆ విషయంలో స్పందించే పరిస్థితి. ఇది వరకు జిల్లా అధికారి ఒకరు సస్పెన్షన్‌కు గురికావడంతో కరీంనగర్‌లో పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సుధాకర్‌ను ఏడాదిన్నర క్రితం ఇక్కడ ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారిగా నియమించారు.

ఎందుకు వేటు పడిందంటే..

ఉద్యానవన శాఖలోనే విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉద్యోగికి సంబంధించి పెన్షన్‌ పత్రాలు అందించే విషయంలో ఇబ్బందులకు గురి చేయడంతో ఆయన టీఎన్‌జీవో నాయకులను ఆశ్రయించాడు. వారు జిల్లా అధికారిని కలిసి పెన్షన్‌ పత్రాలు అందజేయాలని కోరినప్పటికీ ఆ అధికారి పట్టీపట్టనట్టుగా వ్యవహరించాడు. దీంతో టీఎన్‌జీవో నాయకులు హైదరాబాద్‌లో డైరెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు జిల్లా ఇన్‌చార్జి అధికారి సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. జిల్లా శాఖలో అసలు లక్ష్యాలను విస్మరించి ఇలా అధికారులు తమ స్వార్థప్రయోజనాల కో సం అక్రమాలకు పాల్ప డుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పథకాలు..

ఉద్యానవన శాఖ ద్వారా రైతుల సంక్షేమం కోసం వివిధ అభివృద్ధి పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాయి. వాటి లక్ష్యాలను జిల్లాల వారీగా నిర్దేశిస్తున్నాయి. ఇందులో కేంద్ర భాగస్వామ్యం 60 శాతం ఉండగా, రాష్ట్ర భాగస్వామ్యం 40 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్‌, మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ హార్టికల్చర్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద వివిధ పథకాలను అమలు పరుస్తున్నారు. అయితే ఈ పథకాలకు సంబంధించిన లక్ష్యాల సాధన జిల్లాలో అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది.

రైతుల దరిచేరని సంక్షేమం..

జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుంది. ప్రస్తుతం 1600 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి. పండ్ల తోటల సాగు కూడా నామమాత్రంగా 800 ఎకరాల్లోనే ఉంది. ఆయిల్‌పామ్‌ 2500 ఎకరాల్లో సాగవుతుంది. అయితే ఒకప్పుడు కూరగాయలు, పండ్ల సాగుపరంగా జిల్లాలో రైతులు ఆసక్తి కనబర్చినా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవ్వడంతో పలువురు దృష్టి సారించడం లేదనే అభిప్రాయం ఉంది. ఇక డ్రిప్‌, స్ప్రింక్లర్లను రాయితీపై రైతులకు అందించాల్సి ఉండగా, అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లక్ష్యం సాధినలోనూ శాఖ వెనుకబడిందన్న విమర్శలున్నాయి.

ఆయిల్‌పామ్‌ కొనుగోలు కేంద్రాల ప్రణాళికేది..?

ఆయిల్‌పామ్‌ దిగుబడులు మరో మూడు నెలల్లో చేతికి రానున్నాయి. ఇటీవలే కలెక్టర్‌ రాజర్షిషా వీటి విషయంలో జిల్లా అధికారిని ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా అధికారి సస్పెన్షన్‌కు గురికావడంతో దానిపై కార్యాచరణ లోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఉద్యానవన శాఖ పరంగా జిల్లాలో ఒక జిల్లా అధికారి పోస్టుతో పాటు ప్రస్తుతం ఇద్దరు హెచ్‌వోలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి క్లస్టర్‌కు ఒక హెచ్‌ఓ ఉండాల్సి ఉండగా, జిల్లాలో నలు గురు ఉండాల్సిన స్థానంలో ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరే ప్రస్తుతం జిల్లా అంతటా పరిశీలించాల్సిన పరిస్థితి. జిల్లా అధికారి సస్పెన్షన్‌తో ప్రస్తుతం వీరిపై మరింత బాధ్యతలు పెరిగాయి. మరో అధికారిని ఇక్కడికి నియమించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ ఓ హెచ్‌వోను సంప్రదించగా.. పూర్తిస్థాయిలో వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాకుండా జిల్లా అధికారి సస్పెన్షన్‌ వ్యవహారంలోనూ గోప్యత పాటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement