నిరుద్యోగులకు కుచ్చుటోపీ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

Jul 17 2025 3:58 AM | Updated on Jul 17 2025 3:58 AM

నిరుద

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

● ఉద్యోగాల పేరిట ‘డిజిటల్‌’ మోసం ● అమాయక గిరిజనులే టార్గెట్‌ ● జిల్లాలో 300 మంది వరకు.. ● ఒక్కొక్కరి నుంచి రూ.20వేలకు పైనే వసూలు ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధి అవకాశాల పేరిట నిరుద్యోగులను నమ్మించిన ఓ ప్రైవేట్‌ సంస్థ అందిన కాడికి దండుకొని దుకాణం ఎత్తేసింది. ‘డిజిటల్‌ మైక్రోఫైనాన్స్‌’ పేరిట సంస్థను ఏర్పాటు చేసి అమాయక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేశారు. తర్వాత రేపుమాపు అంటూ బుకాయించారు. బాధితులు ప్రశ్నించడంతో మంగళవారం నుంచి కనిపించకుండా పోయారు. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో చోటు చేసుకుంది. బాధితులు బుధవారం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పోలీస్‌ బాస్‌ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉద్యోగం వస్తుందని ఆశపడి అప్పుసొప్పు చేసి కొందరు, బంగారు ఆభరణాలు అమ్మి మరి కొందరు వారికి డబ్బులు చెల్లించారు.

అసలేం జరిగిందంటే..

రెండు నెలల క్రితం ఇంద్రవెల్లి మండలంలోని శంకర్‌గుట్టకు చెందిన ఓ వ్యక్తి ఎన్‌ఆర్‌ఐ పేరిట సోషల్‌ మీడియాలో హల్‌చల్‌చేశాడు. పేదల కోసమే తాను ఇక్కడికి వచ్చానని నమ్మ బలికాడు. ఆదిలా బాద్‌ పట్టణంలోని రాంనగర్‌లోని కేవీకే పక్కనగల ఓ బిల్డింగ్‌లో కార్యాలయం ప్రారంభించాడు. అలాగే ఉట్నూర్‌, జైనూర్‌ ప్రాంతాల్లో బ్రాంచ్‌లు సైతం ఓపెన్‌ చేశాడు. రిమ్స్‌ అభివృద్ధికి రూ.కోటి వరకు ఖర్చు చేస్తానని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి అందరి దృష్టిలో పడ్డాడు. ఆసుపత్రి అధికారులను కలిసి అంబులెన్స్‌, వ్యాన్‌లు, స్ట్రెచ్చర్లు, ఏసీలు, వీల్‌చైర్‌లు, కుర్చీలు తదితర వస్తువులు ఇస్తానని లెటర్‌ ప్యాడ్‌ అందజేశాడు. దీంతో అధికారులు ఆయనను నమ్మారు. తర్వాత జిల్లా కేంద్రంలోని సినిమా రోడ్‌లోని ఓ హోటల్‌లో 200 మంది నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నమ్మబలకడంతో వారంతా ఆయన వలలో చిక్కారు. వారిని ఉట్నూర్‌లోని పూలాజీ బాబా ఆలయానికి ఓ కాన్వాయ్‌ ద్వారా తీసుకెళ్లా డు. అక్కడ నిర్వాహకులకు 2 కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేయిస్తానని నమ్మబలికాడు. ఇవన్ని చూసి నిరుద్యోగులు తమకు మేలు చేకూరుతుందని ఆశపడ్డారు.

రూ.20వేలకు పైగా..

డిజిటల్‌ మైక్రోఫైనాన్స్‌ పేరిట కృష్ణ అనే వ్యక్తి ఈ సంస్థను ఏర్పాటు చేశాడు.జిల్లాలోని ఆయా గ్రామా ల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. నిరుద్యోగులకు బ్యాంకులో ఉద్యోగాలు, ఎలాంటి విద్యాఅర్హత లేకపోయినా ఏదో ఒకఉద్యోగం కల్పిస్తానని నమ్మిం చాడు. ముఖ్యంగా ఆదివాసీలను టా ర్గెట్‌ చేశాడు. రెండు జతల యూనిఫాం, షూ కోసమని, ఇతర ఖర్చుల కోసం రూ.20వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం రూ.20వేల చొప్పున చెల్లించారు. బజార్‌హత్నూర్‌ మండలానికి చెందిన మెస్రం ప్రహ్లాద్‌కు డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. కార్యాలయానికి వెళితే రేపుమాపు అంటూ కాలం వెళ్లదీశాడు. వారంతా మంగళవారం ఒత్తిడి చేయగా బుధవారం దుకాణం షట్టర్‌ మూసివేసి పరారైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలాంటి షూరిటీ లేకుండా రూ.5లక్షల రుణం, నెలకు రూ.15వేల వేతనం, యూనిఫాం, షూ, ఇతర అలవెన్సులు ఇప్పిస్తానని నమ్మబలికాడు.

ఎస్పీని కలిసిన బాధితులు..

బాధితుల్లో తలమడుగు మండలంలోని ఝరి, బ రంపూర్‌, దేవాపూర్‌, గుడిహత్నూర్‌ మండలంలోని గోండ్‌ అర్కాపూర్‌, ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు పొచ్చర, ఉట్నూర్‌ తదితర గ్రామాల వారు ఉన్నా రు. బాధితులంతా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన అఖిల్‌ మహాజన్‌ వారికి భరోసా కల్పించారు.

బంగారం అమ్మి ఇచ్చాను..

మాది మహారాష్ట్ర. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాం. ఇదివరకు నేను ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశాను. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించడంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నా వద్ద ఉన్న బంగారం అమ్మి రూ.20వేలు ఇచ్చాను. విషయం మా ఇంట్లో తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. మాకు న్యాయం చేయాలి.

– రత్నమాల, రాంనగర్‌

నిందితులను పట్టుకుంటాం..

ఉద్యోగం పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొ ద్దు. అలాంటి వారిపై పో లీసులకు సమాచారం అందించాలి. డిజిటల్‌ మై క్రో ఫైనాన్స్‌ పేరిట మో సం చేసిన వ్యక్తులపై బాధితుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేశాం. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ప్రధాన నింది తుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. – అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

నిరుద్యోగులకు కుచ్చుటోపీ1
1/3

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

నిరుద్యోగులకు కుచ్చుటోపీ2
2/3

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

నిరుద్యోగులకు కుచ్చుటోపీ3
3/3

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement