● ఉపాధ్యాయ సంఘాలతో డీఈవో సమావేశం
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబా టు ఇష్టానుసారం చేపట్టిన తీరు ను ప్రస్తావిస్తూ‘సర్దుబాటు గంద రగోళం’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనికి డీఈవో శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ప్రక్రియ రీవెరిఫికేషన్ కోసం ఐదుగురు ఎంఈవోలతో కమి టీ ఏర్పాటు చేశారు.అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రక్రియలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. కేజీబీవీ సెక్టోరియల్ అధికారి పోస్టుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సదరు అధికారిని తొలగించాల ని పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగుల తీరుతో విద్యాశాఖ అభా సుపాలవుతుందన్నారు. డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని, పీఎంశ్రీ నిధులకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాల ని, కేజీబీవీల్లో ఆడిట్ చేయించాలని డీఈవో దృష్టికి తీసుకొచ్చారు. వినతి పత్రం సమర్పించారు. సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణకుమార్, శ్రీకాంత్, జలేందర్, కాంతం, గోపీకృష్ణ, అశోక్, శ్రీనివాస్, నవీన్‌యాదవ్, రియాజ్, మహేందర్, శ్రీనివాస్, సుదర్శన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘సర్దుబాటు’ సరిదిద్దేందుకు కమిటీ