
బ్లాక్‌మెయిలింగ్ దందా గుట్టురట్టు
● 11 మందిపై కేసు, నలుగురి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: భారీ బ్లాక్ మెయిలింగ్ గుట్టు రట్టయింది. నెలనెలా లక్షల్లో వసూళ్లు చేస్తూ, డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ వాహన యజమానులను బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ అఖిల్ మహాజన్ తన కార్యాలయంలో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ–మహారాష్ట్ర గుండా వెళ్లే 44వ జాతీయ రహదారిపై అక్రమంగా తరలించే పశువుల వాహనాల వద్ద బ్లాక్ మెయిలింగ్ దందాలకు పాల్పడుతున్నారు. 11 మంది ముఠాగా ఏర్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్, జిల్లా కేంద్రానికి చెందిన రౌడీషీటర్ రోహిత్ షిండే కీలకంగా ఉన్నారు. పశువులను అక్రమంగా తరలించే వాహనాలను అక్రమంగా తనిఖీ చే స్తూ యజమానులు, డ్రైవర్లను బెదిరింపులకు పా ల్పడుతూ డబ్బులు వసూళ్లకు పాల్పడేవారు. డబ్బులు ఇవ్వకపోతే దాడి చేసి పోలీసులకు ఫిర్యాదులు చేస్తామంటూ బెదిరింపులకు గురిచేసేవారు. ఈ క్ర మంలో పోలీసులకు సమాచారం అందింది. నేరడిగొండలో నలుగురిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో నేరడిగొండకు చెందిన చేతన్ కుమార్, జంగిలి అన్వేష్, ఇచ్చోడకు చెందిన మసీద్ ఆనంద్, ఆదిలాబాద్‌కు మహ్మద్ మజార్ ఉన్నారని పేర్కొన్నారు. ఏడుగురు పరారీలో ఉన్నారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేరడిగొండ పోలీసుస్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇచ్చోడ సీఐ రాజు, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బ్లాక్‌మెయిలింగ్ దందా గుట్టురట్టు