
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. కుంటాల మండలం అందకూర్ గ్రామానికి చెందిన బోండ రవి(23), శ్రీకాంత్‌లు శుక్రవారం స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొనేందుకు బైక్‌పై భైంసాకు వచ్చారు. పార్టీ ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో రాత్రి ఈదురుగాలులకు రోడ్డుకు అడ్డంగా చెట్టుకొమ్మ పడింది. బొండ రవి బైక్ డ్రైవింగ్ చేస్తున్న దాన్ని ఢీకొట్టి గాయాలపాలయ్యాడు. వెనుక కూర్చున్న శ్రీకాంత్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్సులో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో బొండ రవి మృతిచెందాడు. మృతుడి తల్లి నీలాబయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
యువకుడిని కాపాడిన పోలీసులు
కడెం: కడెం ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన యువకుడిని పోలీసులు కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్‌వంశీ మండలంలోని డ్యాంగూడకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. గతకొన్ని రోజుల నుంచి భార్య కాపురానికి రావడం లేదని శనివారం డ్యాంగూడకు వచ్చిన వంశీ మామతో గొడవపడి మనస్తాపం చెందాడు. ఆత్మహత్యకు చేసుకుందామని ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. విషయం తెలుసుకున్న వంశీ మామ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై పి.సాయికిరణ్ సిబ్బందిని హుటాహుటిన ప్రాజెక్ట్ వద్దకు పంపించారు. కానిస్టేబుళ్లు భీంరావు, షాకీర్ అతన్ని కాపాడారు. పురుగుల మందు తాగినట్లు చెప్పడంతో అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అధిక వడ్డీ వసూలు చేస్తున్న ముగ్గురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: అమయాకప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన బంగారి బాలాజీ –రంజనబాయి దంపతుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే కాలనీలో దీపక్ ఇంట్లో సైతం తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, సెల్ డీడీలు, బ్యాంకు చెక్‌లు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.