
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
తలమడుగు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని బరంపూర్ సమీపంలోని కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భర్త దీపక్ తివారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు. మన మహోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ విశాలమైన వాతావరణం చుట్టుపచ్చని కొండలు మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం అదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర్ రెడ్డి, పూజారి స్వస్తిక్, స్వామి కమిటీ సభ్యులు బి.మల్లేశ్, రాజు రమాకాంత్ ఉన్నారు.