
ఎరువుల కోసం ఆందోళన వద్దు
తాంసి: వివిధ రసాయన ఎరువులు అందుబా టులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొ ద్దని డీఏవో శ్రీధర్‌స్వామి పేర్కొన్నారు. మండలంలోని హస్నాపూర్, జామిడి, తాంసి గ్రామాల్లోగల ప్రాథమిక సహకార సంఘాలను గురువారం సందర్శించారు. గోదాంలలోని ఎరువు ల నిల్వలు పరిశీలించారు. స్టాక్ రిజిష్టర్లు పరిశీ లించి కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. మండలంలో 1,708 బ్యాగుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏవో రవీందర్, ఏఈవోలు శివ, నిఖిత, ఆయా సొసైటీల సీఈవోలు కేశవ్, దత్తు, రాంరెడ్డి, సిబ్బంది కార్తిక్, అఖిల్ ఉన్నారు.