మరోసారి సత్తా చాటుతా.. | - | Sakshi
Sakshi News home page

మరోసారి సత్తా చాటుతా..

May 26 2025 12:15 AM | Updated on May 26 2025 9:54 AM

మరోసా

మరోసారి సత్తా చాటుతా..

ఇటీవల పదో తరగతి పూ ర్తయింది. మంచిర్యాలలో ని ఖేలో ఇండియా ద్వారా బాక్సింగ్‌లో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు పాల్గొని సిల్వర్‌, బ్రాంజ్‌ పతకాలు సాధించాను. సీఎంకప్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్‌ పతకం సాధించగా, ఓపెన్‌ స్టేట్‌ బాక్సింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో మూడోస్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో ఆడినా పతకం అందుకోలేకపోయాను. మంచిర్యాలలో నిర్వహిస్తున్న పోటీల్లో గోల్డ్‌ పతకం సాధిస్తాను. – క్రితి అగర్వాల్‌, మంచిర్యాల

జాతీయస్థాయిలో రాణిస్తా

ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇటీవల టెన్త్‌ చదివాను. రాష్ట్రస్థాయిలో ఎస్జీఎఫ్‌లో రెండు గోల్డ్‌మెడల్స్‌ సాధించాను. బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీల్లో 46, 48 కేజీల విభాగంలో గోల్డ్‌మెడల్స్‌ సాధించాను. జాతీయస్థాయి పోటీల్లో నాలుగుసార్లు పాల్గొనగా ఒకసారి దేశంలోనే 8వ స్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో గోల్డ్‌మెడల్‌ సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాను. – నిహారిక, నిజామాబాద్‌

గోల్డ్‌మెడల్‌ సాధిస్తా

రాష్ట్రస్థాయిలో సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ పోటీల్లో, ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్స్‌ సాధించాను. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, గోవాకు ఎంపికయ్యాను. పదోతరగతి ఇటీవల పూర్తి చేయగా, 8వ తరగతి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నా. జాతీయస్థాయిలో పాల్గొని గోల్డ్‌మెడల్‌ను సాధించాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నాను.

– జె.అనుగ్రహ, హైదరాబాద్‌

జాతీయస్థాయిలో ఆడేందుకు శిక్షణ

ఇటీవల ఇంటర్‌ పూర్తయింది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడి గోల్డ్‌మెడల్‌ సాధించాను. జాతీయస్థాయిలో ఒకసారి ఆడి, సెమీఫైనల్‌ చేరాను. ఫైనల్‌ చేరేలా శిక్షణ తీసుకుంటూనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నా. జాతీయస్థాయిలో రాణించేలా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నా. – సంస్కృతి, మంచిర్యాల

మరోసారి సత్తా చాటుతా..
1
1/3

మరోసారి సత్తా చాటుతా..

మరోసారి సత్తా చాటుతా..
2
2/3

మరోసారి సత్తా చాటుతా..

మరోసారి సత్తా చాటుతా..
3
3/3

మరోసారి సత్తా చాటుతా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement