ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు బడికి వచ్చి టీచర్ల కోసం నిరీక్షించడమనేది సహజంగా కనిపించే పరిస్థితి. అయితే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని గుండంలొద్ది, దొండరిగూడ ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈ పాఠశాలల్లో బోధించే టీచర్లు హాజరుకాగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో టీచర్లు ఇలా ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఊరిలో పెళ్లి ఉండటంతో విద్యార్థులెవరూ బడికి రాలేదని సార్లు చెప్పడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
సార్లు ప్రజెంట్.. స్టూడెంట్స్ ఆబ్సెంట్!