
మాట్లాడుతున్న రత్నజాడే ప్రజ్ఞాకుమార్
ఆదిలాబాద్‌రూరల్: జనవరి ఒకటో తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే బీమా కోరేగావ్ శౌర్య దినోత్సవాన్ని విజయవంతం చేయాల ని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగా ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞా కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలా బాద్ పట్టణంలోని భుక్తపూర్‌లోని మహా ప్రజ్ఞా బుద్ధ వీహర్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ర్యాలీ నిర్వహణ కోసం అన్నీ ఏ ర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకునేందుకు సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మహా ప్రజ్ఞా బుద్ధ వీహర్ అభివృద్ధి కమిటీ రత్నజాడే ఉదయ్ కుమార్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ యూత్ జిల్లా అధ్యక్షుడు రాజు మస్కే, సంఘమిత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాజు పటాడే, మాల యువ సేన పట్టణ అధ్యక్షులు జాడే సిద్ధార్థ్ పాల్గొన్నారు.