ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
మంచిర్యాలక్రైం: మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 30న జరిగిన ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ విధించారు. కోడ్ ఉల్లంఘించి దివాకర్‌రావు తన అనుచరుతో కలిసి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని స్వతంత్య్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ నయిమ్ పాషా వీడియోతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో దివాకర్‌రావ్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపాడు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నయ్యపై కేసు
నెన్నెల: బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు. చిన్నయ్య గురువారం తన స్వగ్రామం జెండావెంకటాపూర్‌లో పార్టీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. స్పందించిన ప్రిసైడింగ్ అధికారి రాజశేఖర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు.