న్యూస్‌రీల్
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ యువజన విభాగం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపో యి రోజులు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆయన వెంట రైతులు ఉన్నారు.