
సమావేశంలో సాజిద్‌ఖాన్
కైలాస్‌నగర్: మైనార్టీలను ఓటు బ్యాంక్‌గా చూడకుండా, చట్టసభల్లో అడుగుపెట్టేలా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ కోరారు. సీడబ్ల్యూసీ సభ్యులు నాజిర్ హుస్సేన్, సల్మాన్ ఖుర్షీద్, షకీల్ అహ్మద్, మైనార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని నిజాం క్లబ్‌లో నిర్వహించిన సీడబ్ల్యూసీ మైనార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనాదిగా మైనార్టీలు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం వలన మైనార్టీలు కాంగ్రెస్‌కు దూరమయ్యే ప్రమాదముందని తెలిపారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులకు పార్టీ పక్షాన అవకాశం కల్పించాలని, విషయాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.