breaking news
Yevam Movie
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన రెండు థ్రిల్లర్ సినిమాలు
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే రెండు మూవీస్ వచ్చేశాయి. కాకపోతే ఇవి ఇప్పటికే ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా వేరే వాటిలోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి తెలుగు స్ట్రెయిట్ మూవీ కాగా, మరొకటి డబ్బింగ్ బొమ్మ. ఇంతకీ ఇవేంటి? ఏ ఓటీటీల్లో ఉన్నాయి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!)తెలుగమ్మాయి చాందిని చౌదరి పోలీస్‌గా నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'యేవమ్'. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. ఇదివరకే ఆహా ఓటీటీలో ఉండగా.. ఇప్పుడు సన్ నెక్స్ట్‌లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఇందులో హాట్ బ్యూటీ అషూరెడ్డి కూడా కీలక పాత్రలో నటించింది.మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శబరి'. కూతురిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి పడే తపన చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా తీశారు. సస్పెన్స్‌తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. కొన్నిరోజుల క్రితం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఐదు భాషల్లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. ఈ వీకెండ్ ఏమైనా థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే వీటిని ట్రై చేసి చూడండి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
లేడీ పోలీస్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
'కలర్ ఫోటో' సినిమా హీరోయిన్ చాందిని చౌదరి లేటెస్ట్ మూవీ 'యేవమ్'. లేడీ ఓరియెంటెడ్ కథతో తీసిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో చాందిని పోలీస్‌గా నటించింది. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ 'యేవమ్' సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ)షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ గా నటిగా మారిన చాందిని చౌదరి.. కొన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 'కలర్ ఫోటో' వల్ల ఈమెకు గుర్తింపు దక్కింది. దీని తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. వారాల వ్యవధిలో ఈమె నటించిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో 'యేవమ్' చిత్రాన్ని తాజాగా ఆహా ఓటీటీలో జూలై 25 నుంచి అంటే గురువారం మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.'యేవమ్' కథ విషయానికొస్తే.. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో సౌమ్య (చాందిని చౌదరి)కి ప్రొబేషనరీ ఎస్సైగా పోస్టింగ్ వస్తుంది. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైతో ప్రేమలో పడుతుంది. మరోవైపు అదే స్టేషన్ ఫరిదిలో యుగంధర్ అనే వ్యక్తి, హీరోల పేర్లు చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటాడు. ఇతడి వల్ల ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. సౌమ్యకి యాక్సిడెంట్ అవుతుంది. చివరకు ఏమైంది? పోలీసులు యుగంధర్ని పట్టుకున్నారా లేదా అనేదే పాయింట్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ) -
Yevam Review: యేవమ్ మూవీ ఎలా ఉందంటే..?
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వికారాబాద్ చెందిన సౌమ్య(చాందిని చౌదరి) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదిస్తుంది. తను ఆ జాబ్ చేయడం తండ్రి, సోదరుడికి అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా సౌమ్య ఉద్యోగాన్ని వదులుకోదు. తన పై అధికారి అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు ఎనలేని అభిమానం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొనే పోలీసు వృత్తిని ఎంచుకుంటుంది. సౌమ్య ఉద్యోగంలోకి చేరిన కొద్ది రోజులకే వికారాబాద్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. యుగంధర్(వశిష్ట సింహ) అనే ఓ వ్యక్తి హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి..హత్యలు చేస్తుంటాడు. ఈ కేసును సౌమ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అభికి సమాచారం యుగంధర్ని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యుగంధర్ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? అసలు ఎవరీ యుగంధర్? హీరోల పేర్లు చెప్పి ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు? అభికి యుగంధర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసును సౌమ్య ఎలా డీల్ చేసింది? చిత్రానికి యేవమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సైకో థ్రిల్లర్‌ని, స్ల్పిట్ పర్సనాలిటీ కలిపి కథగా మార్చుకున్నాడు దర్శకుడు ప్రకాష్ దంతులూరి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉన్నా.. తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసేందుకు ప్రయత్నించాడు. కథ ప్రారంభంలోనే యుగంధర్ నైజం ఏంటో అర్థమైపోతుంది. అఘరెడ్డి బెడ్ సీన్‌తో కథను ప్రారంభించి.. ఆ తర్వాత స్టోరీని వికారాబాద్ పోలీసు స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అభి, సౌమ్య పాత్రల పరిచయం..వారి నేపథ్యం చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉంటుంది. ప్రభాస్ పేరు చెప్పి ఓ అమ్మాయిని ట్రాప్ చేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా యుగంధర్ వరుసగా హీరోలను పేర్లు చెబుతూ అమ్మాయిలను ట్రాప్‌లోకి దించడం బోర్ కొట్టిస్తుంది.మరోవైపు అభి-సౌమ్యల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. అసలు సౌమ్య అభిలో ఏం చూసి ఇష్టపడిందనే పాయింట్‌ని బలంగా చూపించలేకపోయారు. సైకోని పట్టుకునేందుకు సౌమ్య ఇచ్చే సలహాలు కూడా సింపుల్‌గానే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పటికే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రేక్షకుడికి ఇంటర్వెల్ బ్యాంగ్ షాకిస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఊహకందేలా సాగుంది. సైకో పక్కన తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం.. అతని కవ్వింపు చర్యలు అవన్నీ రొటీన్ సైకో థ్రిల్లర్స్లాగే ఉంటాయి. సౌమ్య సైకోని ఎలా పట్టుకొంది? ఎలా గుర్తించింది? అనేది మరింత బలంగా చూపిస్తే బాగుండేది. అక్కడ రివీల్ చేసే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోలేదు. తెలంగాణ ఒగ్గు కథ పాటతో ఓ ప్రధాన సన్నివేశాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్. స్క్రీన్‌ప్లే మాదిరి కథను కూడా ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. తొలిసారి చాందిని పోలీసులు పాత్రను పోషించి మెప్పించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు. అభిగా భరత్ రాజ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఆ పాత్రలో తెలిసిన నటుడైతే బాగుండేది. కానిస్టేబుల్‌గా గోపరాజు రమణ తో పాటు మిగిలిన నటీనటులతో తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.