breaking news
Yemen conflict
-
'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి'
ఐక్యరాజ్యసమితి : యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో మొత్తం 900 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 1300 మందికిపైగా చిన్నారులు మరణించారు. ఈ మేరకు యూనిసెఫ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ మొత్తం 2015 మార్చి నాటి నుంచి ఇప్పటి వరకు మరణించిన చిన్నారుల సంఖ్య అని స్పష్టం చేసింది. యెమెన్లో నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులపై 1,560 ఘటనలు చోటు చేసుకున్నాయని తమ సంస్థ పరిశీలనలో వెల్లడి అయిందని తెలిపింది. 2015, మార్చి నాటి నుంచి ప్రతి రోజు కనీసం ఆరుగురు చిన్నారులు మృతి చెందారని నివేదికలో పేర్కొంది. దేశంలోని తైజ్ సనా, సాద, అడెన్, హజ్హ్ గవర్నరేట్ల పరిధిలో అధిక మరణాలు చోటు చేసుకున్నట్లు వివరించింది. యెమెన్లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు వర్గానికి, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే. అయితే 2015 మార్చి నాటి నుంచి యెమెన్లో భద్రత క్షీణించిందని తెలిపింది. ఈ ఘర్షణల వల్ల 21.2 మిలియన్ల మంది ప్రజలు బాధితులుగా మారారని యూనిసెఫ్ చెప్పింది. సాధ్యమైనంత త్వరగా దేశంలో మానవతా సహాయం అవసరమని యూనిసెఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. -
యెమెన్లో 279 మంది చిన్నారుల మృతి
యూనైటెడ్ నేషన్స్ : యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో 279 మంది చిన్నారులు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ (యూనిసెఫ్) బుధవారం వెల్లడించింది. మరో 402 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. గడిచిన 10 వారాల కాలవ్యవధిలో వీరంతా మృతి చెందారని పేర్కొంది. అయితే గతేడాది దేశంలో జరిగిన ఘర్షణల్లో 74 మంది చిన్నారులు మరణించగా... మరో 244 మంది గాయపడ్డారని వివరించింది. యెమెన్లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు అబెడ్రాబోహాదీ, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే.