breaking news
Yazidi
-
నరక లోకపు వారసులు ఈ ఐసిస్ తీవ్ర వాదులు
కన్న కొడుకు మాంసం వండి తల్లికి చెప్పకుండా తినిపించారు ఇరాక్‌లోని ఐసిస్ ముష్కరులు. తాను తిన్నది తన ఏడాది బిడ్డ మాంసంతో చేసిన కూరని ఆ తల్లికి ఐసిస్ ఉగ్రవాదులే చెప్పారు. ఇంతకీ ఆమె చేసిన పాపం క్రైస్తవ, ఇస్లాం, జొరాస్ట్రియన్ మతాల విశ్వాసాలు కొన్ని కలిపి భిన్న సంప్రదాయాలతో జీవించే యజీదీ జాతిలో జన్మించడమే. సున్నీ ముస్లిం ఛాందసవాదులమని చెప్పుకునే ఐసిస్ ఉగ్రవాదులు మాత్రం యజీదీలను దెయ్యాలను పూజించే జాతిగా పరిగణిస్తారు. వాయవ్య ఇరాక్, వాయవ్య సిరియా, నైరుతి టర్కీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాకవర్గమే యజీదీలు. ఇరాక్ భూభాగం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లోకి రావడంతో కుర్దుల మాదిరి అనేక పొరుగు దేశాల్లో చెల్లాచెదురై ఉన్న యజీదీల జీవితం నరకప్రాయంగా మారింది. ఐసిస్ 2014 ఆగస్ట్ నెలలోని కొన్ని రోజుల్లో దాదాపు పది వేల మంది యజీదీలను చంపడమో లేదా బంధించడమో చేసిందని ‘ప్లాస్మెడిసిన్’ అనే వారపత్రిక వెల్లడించింది. అన్ని దేశాల్లో కలిపి యజీదీల జనాభా ఐదు లక్షల వరకూ ఉంటుందని అంచనా. నాలుగు లక్షల యాజిదీలకు నరకం! వాయువ్య ఇరాక్‌లోని మౌంట్ సింజార్ చుట్టుపక్కల ప్రాంతంలో జీవించే దాదాపు నాలుగు లక్షల మంది యజీదీలు 2014 ఆగస్ట్ 3న ఐసిస్ జరిపిన దాడిలో కోలుకోలేనంతగా నష్టపోయారు. తరతరాలుగా స్థిరపడిన ఈ ప్రాంతం నుంచి దూరప్రాంతాలకు పారిపోవాల్సివచ్చింది. పారిపోలేని యజీదీలను సున్నీ తీవ్రవాదులు చిత్రహింసలు పెట్టి చంపారు. పట్టుబడిన మహిళలను హింసించి అత్యాచారం చేసి చంపారు. పదేళ్ల ఆడపిల్లలు సైతం లైంగిక హింసకు బలై ప్రాణాలు కోల్పోయారు. యజీదీ యువతులను వేలంవేసి అమ్మేశారు. మత మార్పిడీ అనే సంప్రదాయమే లేని యజీదీలు కొందరిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ దాడి ఫలితంగా మౌంట్ సింజార్ ప్రాంతానికి పారిపోయిన యజీదీల కష్టాలు వర్ణనాతీతం. ఐసిస్ సాయుధులు దిగ్బంధనం ఫలితంగా కొన్ని రోజులు వేలాది మంది యజీదీలు 50 డిగ్రీల ఉష్టోగ్రత మధ్య నీరు, తిండి లేకుండా అక్కడే నిలిచిపోయారు. అమెరికా సేనల సాయం, ఆహార పొట్లాల జారవేతతో కొందరు ప్రాణాలు నిలుపుకున్నారు. చివరికి తమ మాదిరి పలు దేశాల్లో చెల్లాచెదురై ఉన్న మైనారిటీ వర్గమైన కుర్దుల సాయంతో వారం తర్వాత సిరియా, ఇరాక్‌లోని కుర్దుస్థాన్ ప్రాంతాలకు క్షేమంగా చేరుకోగలిగారు. మత విశ్వాసాలే యాజిదీలకు శాపాలయ్యాయి! పశ్చిమాసియాలోని మూడు ప్రధాన ఏకేశ్వరవాద మతాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని భిన్న మార్గంలో జీవించే యజీదీల మతంలోకి మారడానికి అవకాశం లేదు. మరి స్థానిక సంప్రాదాయ మతాలకు భిన్నమైన జీవన శైలి ఉన్న యజీదీలపై కక్షగట్టిన ఐసిస్ ఉగ్రవాదులు ఇస్లాం బోధనలకు భిన్నంగా వారిని చిత్రహింసలకు గురిచేశారు. యజీదీల 93శాతం హత్యలు మౌంట్ సింజార్లోనే జరిగాయి. తప్పించుకోవడానికి వీలులేని రోజుల్లో స్త్రీలు, పిల్లలే ఇస్లామిక్ స్టేట్ రాక్షసత్వానికి బలయ్యారు. టీనేజి యజీదీ పిల్లలను బలవంతంగా మతం మార్చి ఐసిస్ బాల సైనికులుగా చేశారని లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ (ఎలెస్యీ) పరిశోధకుడు డా.వాలరియా చెటోరిలి వెల్లడించారు. మతహీనులైన యజీదీలను పూర్తిగా నిర్మూలిస్తామని మూడేళ్ల క్రితమే ఐసిస్ తన ఇంగ్లిష్ పత్రిక ‘దబీక్’లో హెచ్చరించింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
భారతీయసంతతి వ్యక్తి 'ఐఎస్ఐఎస్' కమాండర్!
బ్రిటీష్-ఇండియన్ సిద్ధార్ద్ దార్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) లో కీలకపాత్రదారుడిగా మారాడా? అవును. ఇస్లామిక్ స్టేట్ లో బానిసగా ఉండి తప్పించుకు వచ్చిన నిహాద్ బరాకత్ ఈ విషయాన్ని చెప్తోంది. ఇవే కాకుండ ఇస్లాం పేరుతో జీహాదీలు చేసే అకృత్యాలు ఆమె మాటల్లోనే.. తనను సిద్ధార్ద్ దార్ అలియాస్ అబూ దార్ కిడ్నాప్ చేసి ఇస్లామిక్ స్టేట్ కు తరలించినట్లు ఆమె బ్రిటీష్ ముస్లీం టీవీకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపింది. సిద్ధార్ద్ 2014లో తన భార్య, బిడ్డతో బ్రిటన్ నుంచి సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరాడు. ప్రస్తుతం బాలిక తెలిపిన వివరాల ప్రకారం దార్ మోసుల్ అనే ప్రాంతానికి లీడర్ గా నియమితులయ్యారు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో.. ఆయన వీదేశీయుడా అని బాలికను టీవీ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఆమె అవునని సమాధానం ఇచ్చింది. అంతేకాక సిద్ధార్ద ఫోటోను ఆమెకు చూపినప్పుడు అతన్ని గుర్తుపట్టడమే కాకుండా భయంతో వణికిపోయింది. ఇక ఇంటర్వూ వద్దని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు టీవీ ప్రతినిధి తెలిపారు. యాజిడీకి చెందిన ఎంతో మంది మహిళలను దార్ ఇస్లామిక్ స్టేట్ సెక్స్ బానిసలుగా మార్చడని, తాను వేరే ఐఎస్ వ్యక్తి వల్ల గర్భం దాల్చడానికి కారణం అతడేనని ఆమె వివరించింది. పదహారేళ్ల వయసులో బరాకత్, ఆమె కుటుంబసభ్యులు 27 మందిని బానిసలుగా బంధించినట్లు, మొదట ఆమెకు ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపారని తెలిపింది.మహిళలను జీహాదీలు రెండు భాగాలుగా విభజించారని పెళ్లయిన వాళ్లు, అవివాహితులు. వీరిలో అవివాహితులను మోసుల్ అనే ప్రాంతానికి తరలిస్తారని, బరాకత్ ను అక్కడ తరలించిన తర్వాత దార్ నీవు ఇంతకుముందే వివాహం చేసుకుని ఉండాల్సిందని తరచు అనేవాడని తెలిపింది. బరాకత్ కుటుంబాన్ని మొత్తం ఇస్లాం స్వీకరింమని చెప్పారని లేకపోతే చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. 17 ఏళ్ల బరాకత్ ప్రస్తుతం ఉత్తర ఇరాక్ లోని ప్రజలకు ఇస్లామిక్ స్టేట్ గురించి అవగాహన కల్పిస్తోంది. -
ఐఎస్ చెర నుంచి 200 మంది బందీలు విడుదల
బాగ్దాద్: గతంలో అపహరించిన ఇజ్ది తెగకు చెందిన దాదాపు 200 మందిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది. బాగ్దాద్‌కు 250 కిలోమీటర్లు దూరంలోని కిరిక్ పట్టణంలో వీరిందరిని శనివారం వదిలిపెట్టారని తెలిపింది. పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విడుదలైన బందీలలో అత్యధికులు వృద్ధులు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో సింజర్ పట్టణంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇజ్ది తెగకు చెందిన వారిపై దాడి చేసి చంపారు. అనంతరం వందలాది మందిని అపహరించుకుని పోయిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 10వ తేదీ నుంచి ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నరమేథం సృష్టిస్తున్నా విషయం విదితమే.