breaking news
World photographars Day
-
World Photography Day 2023 Photos: వరల్డ్ ఫోటోగ్రఫీ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
‘కోట’లో మోడల్స్ సందడి
ఖిలా వరంగల్ : ప్రపంచ ఫొటోగ్రాఫర్స్డే సందర్భంగా చారిత్రక ఖిలావరంగల్ కోటలో వైజాగ్ మోడల్స్ సందడి చేశారు. ఫొటోగ్రాఫర్స్ మాస్టర్ సుధాకర్‌రెడ్డి, జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోట శిల్పాల ప్రాంగణంలో శనివారం ఫొటోగ్రఫీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి హాజరై ఆవగాహన సదస్సును ప్రారంభించారు. ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లాకు వచ్చిన వైజాగ్‌కు చెందిన ఐదుగురు మోడల్స్ ఈ సందర్భంగా తమ భంగిమలతో ఆకట్టుకున్నారు. శిల్పాల ప్రాంగణంలో మోడల్స్ ప్రదర్శించిన స్టిల్స్‌ను నూతన టెక్నాలజీతో వచ్చిన వీడియో కెమెరాలు, ఫొటో కెమెరాలతో చిత్రీకరిస్తూ ఫొటోగ్రాఫర్లకు అవగాహన కల్పించారు. మోడల్స్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు తరలిరావడంతో కోట ప్రాంతంలో సందడి నెలకొంది. ఫొటోగ్రాఫర్స్ జిల్లా ఆసోసియేషన్ బాధ్యులు రవీందర్‌రెడ్డి, కిన్నెర సాంబయ్య, సర్వేశ్వర్, ఆనందం, మధు తదితరులు పాల్గొన్నారు.