breaking news
World Bank conditions
-
ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..
వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల ఆధారంగా ప్రపంచ బ్యాంకు రూపొందించే బీ–రెడీ రిపోర్ట్(Report)లో మంచి స్కోరు దక్కించుకోవాలంటే భారత్‌కి కాస్త సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని మేధావుల సంఘం జీటీఆర్ఐ ఒక నివేదికలో పేర్కొంది. బిజినెస్ ఎంట్రీ, కార్మిక చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాల విషయంలో ప్రపంచ బ్యాంకు(World Bank) అంచనాలకు భారత్ దూరంగా ఉందని వివరించింది.ఈ నేపథ్యంలో బీ–రెడీలో (బిజినెస్ రెడీ) చోటు కోసం భారత్, ప్రధానంగా దేశీయంగా సంస్కరణలతో పాటు అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను కూడా అధ్యయనం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. సాధారణంగా డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ పేరిట వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులపై ప్రపంచ బ్యాంక్ గ్రూప్ .. ర్యాంకింగ్‌లు ఇస్తూ వస్తోంది. కానీ, దీని రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో 2020 నుంచి దాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త విధానాలతో బీ–రెడీ రిపోర్ట్‌ను రూపొందిస్తోంది. వ్యాపారాల విషయంలో అవరోధాలు ఈ రిపోర్ట్‌లో ప్రధాన అంశాలుగా ఉంటాయి.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!బీ-రెడీ నివేదిక ప్రపంచ బ్యాంకు కొత్త ఫ్లాగ్ షిప్ రిపోర్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని అంచనా వేస్తోంది. ఇది గతంలో ఉన్న ‘డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’ను భర్తీ చేస్తుంది. దేశంలోని వ్యాపార అనుకూలతలు, కార్మిక నిబంధనలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి ఎన్నో అంశాలను పరిగణిస్తుంది. బీ-రెడీ ఫ్రేమ్‌వర్క్‌లో చేరడానికి భారత్ సిద్ధమవుతుంది. అయితే ఇందులో మంచి స్కోర్ సంపాదించడం కొంత కష్టమని జీటీఆర్ఐ తెలిపింది. భారత్ చాలా రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ, డిజిటల్ ఇంటిగ్రేషన్, కస్టమ్స్(Customs) చెల్లింపుల్లో ఆలస్యం, కొన్ని విభాగాల్లో స్థిరమైన నిర్ణయాలు అమలు చేయడంలేదనే వాదనలున్నట్లు హైలైట్ చేసింది. -
'ప్రపంచ బ్యాంకు షరతులు ఒప్పుకోని వైఎస్ఆర్'
-
'ప్రపంచ బ్యాంకు షరతులు ఒప్పుకోని వైఎస్ఆర్'
హైదరాబాద్: పేదలకు మేలుచేసే అభివృద్ధి విధానాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసినందునే ఆయన రెండవసారి గెలిచారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ హాలులో తెలంగాణ పీసీసీ 'భవిష్యత్ తెలంగాణ' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సంక్షేమానికి కోతపెట్టాలన్న ప్రపంచ బ్యాంకు షరతులకు వైఎస్ ఒప్పుకోలేదన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకరించి, సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చినందునే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారని గుర్తు చేశారు. విద్య ప్రైవేటీకరణ, కార్పోరేషన్ కాలేజీల వల్ల పేదలకు నష్టమే తప్ప లాభంలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కార్పోరేషన్ కాలేజీలు ఇక ఉండవేమో అనుకున్నానని, అయితే ఎందుకో ఇంకా ఆ కాలేజీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాన్ని గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. గత అయిదేళ్లలో కాంగ్రెస్ దేశాన్ని రిటైల్‌గా అమ్మితే ఇప్పుడు బీజేపీ హోల్‌సేల్‌గా అమ్మాలనుకుంటుందని విమర్శించారు. ఇదేవిధంగా కొనసాగితే 2019లో బీజేపీ గెలవదని చెప్పారు. యుపీఏ హయాంలో చిదంబరం అపరిమిత అధికారాలు అనుభవించారని అన్నారు. కానీ ఇప్పుడాయన బీజేపీ ప్రతినిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారని హరగోపాల్ తెలిపారు. ఈ సదస్సులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు కాంగ్రెస్ నేతలు, మేథావులు ప్రసంగించారు. **