breaking news
We Want
-
రమ్య యాక్ట్ తేవాలి:మెరిడియన్ విద్యార్ధులు
-
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్
సాక్షి, హైదరాబాద్: ఆటోడ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. తనిఖీల పేరిట ఆర్టీఏ, ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి (ఈ నెల 27) నుండి నిరవధిక ఆటోబంద్కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్లోని హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, జాయింట్ కన్వీనర్లు జె.రవీందర్, లక్ష్మీనర్సయ్యలు మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం 11 గం టలకు ట్రాన్స్పోర్ట్ భవ నం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
నడిరోడ్డుపై భార్య మెడ కోసిన భర్త
మంగళగిరి రూరల్ పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ ఆటోడ్రైవర్ భార్యపై దాడికి తెగబడ్డాడు. రోడ్డుపక్కన నిలబడి బస్సుకోసం వేచి చూస్తున్న ఆమెను అందరూ చూస్తుండగానే కత్తితో మెడ కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమె రక్తపు మడుగులో పడి సృ్పహ కోల్పోయింది. హఠాత్పరిణామాన్ని చూసి స్థానికులు నిశ్చేష్టులయ్యారు. రేవేంద్రపాడు వంతెన వద్ద సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలంరేవేంద్రపాడుకు చెందిన చెందిన షేక్ నూర్జహాన్ (36)కు, అదే గ్రామానికి చెందిన సుభానీ అలియాస్ బాపూజీతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నూర్జహాన్ రేవేంద్రపాడులో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తుండగా సుభానీ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం సుభానీ అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో కలసి ఇల్లు వదలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నూర్జహాన్ పిల్లలతో కలసి అత్త, మామల వద్దే వుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నూర్జహాన్ నూతక్కి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోని జరిగే సమావేశానికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డు పక్కన వేచిచూస్తోంది. ఐదేళ్లుగా జాడలేని సుభానీ ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాడో వెనుక నుంచి నూర్జహాన్పై కత్తితో దాడి చేశాడు. మెడ కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమె రక్తపు మడుగులో పడిపోయి సృహ కోల్పోయింది. ఆకస్మాత్తుగా జరిగిన ఘటనతో నిశ్ఛేష్టులైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల స్పందనతో తప్పిన ప్రాణాపాయం... దాడి విషయం తెలియగానే వెంటనే స్పందించిన మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐ వై.సత్యనారాయణ సిబ్బందితో వచ్చి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఎన్నారై ఆస్పత్రికి తరలించేందుకు ఆటో ఎక్కించారు. దారిలో 108 వాహనం ఎదరుపడటంతో దానిలోకి మార్చి ఆస్పత్రికి చేర్చారు. ముందుగానే ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు అలర్ట చేసి, బాధితురాలకి సకాలంలో వైద్యం అందేలా చేయడంతో ఆమె ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.