breaking news
water pump
-
గ్రేటర్‌కు జలాభిషేకం
మూడేళ్ల ముచ్చట నగరవాసి గొంతు తడిపేందుకు జలమండలి నిరంతరం కృషిచేస్తూనే ఉంది. కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటి పథకాలను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, జలమండలి ఏడాదిగా సఫలీకృతమయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరో కృష్ణా మూడుదశలు, గోదావరి మంచినీటి పథకాల ద్వారా నిత్యం 405 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని తరలించి 9.65 లక్షల నల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ మిషన్ భగీరథ పథకం కింద రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 1250 కిలోమీటర్ల మార్గంలో తాగునీటి పైపులైన్లను ముందుగానే రికార్డు సమయంలో పూర్తిచేసింది. మరో 44 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబరు వరకు పూర్తిచేయనున్నారు. అర్బన్ భగీరథ పథకం పూర్తితో నూతనంగా 870 కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న 25 లక్షలమంది దాహార్తి దూరమైంది. ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 183 గ్రామపంచాయతీలు, 7 నగరపాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.628 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న పనులకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది.పటాన్చెరు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి దాహార్తిని తీర్చేందుకు గోదావరి మూడో రింగ్ మెయిన్ పైపులైన్ పనులు మొదలుకానున్నాయి. మరో వందేళ్లు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేశవాపూర్‌లో రూ.7770 కోట్ల అంచనావ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. -
క్రికెట్ బంతి కోసం వెళ్లి..
బనగానపల్లి(కర్నూలు): క్రికెట్ బంతి కోసం వెళ్లిన చిన్నారి కుళాయి గుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు ఈ రోజు ఈస్టర్ కావడంతో చర్చికి వెళ్లి వచ్చారు. అనంతరం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అతని నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బంతి కుళాయి గుంతలో పడటంతో.. దాని కోసం వెళ్లిన చిన్నారి గుంతలో పడిపోయాడు. గుంతలో నీళ్లు ఉండటంతో అందులో మునిగి మృతిచెందాడు. విగతజీవిగా మారిన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.