breaking news
Watchman Suicide
-
వరంగల్‌లో మరో సెల్ఫీ సూసైడ్ కలకలం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్తో అప్పులపాలై యువకుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరిచిపోక ముందే మరో వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అపార్ట్మెంట్ యజమాని కులం పేరుతో దూషించి, దాడి చేశాడని వాచ్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా గత వారం రోజుల్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం ఇది రెండో ఘటన. ఆత్మహత్యకు పాల్పడ్డ అపార్ట్మెంట్ వాచ్మెన్ వడ్లకొండ శ్రీనివాస్, ఓనర్ వేధింపులు కులం పేరుతో దూషించడమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయిదు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్, ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. తన ఆత్మహత్యకు అపార్ట్మెంట్ ఓనర్ యాదగిరి ఆయన భార్య హిందుమతి, పనిలో పెట్టించిన రాజయ్య ఆయన భార్య కారణమని ఆరోపించాడు. సెల్ఫీ వీడియో ద్వారా వారు పెట్టిన ఇబ్బందులను చూపించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్మాగా మారడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీనివాస్ కొద్దిరోజులు అపార్ట్మెంట్లో ఉండి వాచ్‌మెన్‌గా పనిచేసి బయటికి వచ్చినప్పటికీ యాదగిరి హిందుమతి దంపతులు మళ్లీ శ్రీనివాసునే పిలిపించుకుని వాచ్‌మెన్‌గా పెట్టుకున్నారని బంధువులు తెలిపారు. గౌడ కులస్థుడైన శ్రీనివాస్ కులాంతర వివాహం ఎస్సీ మహిళను చేసుకోవడంతో కులం పేరుతో దూషించి కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. అంటరాని వారిగా చూస్తూ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. అపార్ట్మెంట్ యజమాని ప్రస్తుతం పరారీలో ఉండగా.. గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరువు ఆత్మహత్యగా భావిస్తు కుల సంఘాలు అక్కడి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. . -
మంత్రి ఫాంహౌస్‌లో వాచ్‌మన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మంత్రి డీకే అరుణ ఫాంహౌస్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట శివారులో ఉన్న డీకే అరుణ ఫాంహౌస్‌లో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గం, ధారూరు మండలం, వేములపల్లిగ్రామానికి చెందిన శివరాముడు(26) వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతను శుక్ర వారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌పూల్ పక్కనే పడిఉన్న అతని మృతదేహాన్ని అక్కడి సిబ్బంది కనుగొన్నారు. దీనిపై అదే ఫాంహౌస్‌లో పనిచేస్తున్న మంత్రి బంధువు డీకే పుష్పలత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి వెంటనే బంధువులకప్పగించారు. అయితే ఈ వివరాలేవీ మీడియాకు వెల్లడించకుండా తప్పించుకు తిరిగారు. మీడియా పట్టుపట్టడంతో రాత్రి 10గంటల సమయంలో కేసు వివరాలను అసంపూర్తిగా తెలిపారు.