breaking news
warangal team
-
తైక్వాండో చాంప్ వరంగల్
రాష్ట్ర ఆర్జీకేఏ క్రీడలు ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ (ఆర్జీకేఏ) క్రీడల్లో తైక్వాండో బాలుర ఓవరాల్ టీమ్ టైటిల్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. బాలికల ఓవరాల్ టీమ్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జట్లు సంయుక్తంగా గెల్చుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం జరిగిన తైక్వాండో బాలుర విభాగంలో 29 పాయింట్లతో వరంగల్ అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 17 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా...నల్లగొండ జట్టు 13 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. అలాగే బాలికల విభాగంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లా జట్లు సంయుక్తంగా విజేతగా నిలువగా, వరంగల్ జట్టు మూడో స్థానం పొందింది. 400 మీటర్ల విజేతలు రామ్‌రెడ్డి, కావ్య అథ్లెటిక్స్ మీట్లో బాలుర విభాగం 400 మీటర్ల లో నల్లగొండ అథ్లెట్ రామ్‌రెడ్డి 53.86 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం గెలిచాడు. వి.నాగరాజ్ (ఖ మ్మం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతం గెల్చుకోగా, జి.మధు (ఖమ్మం) తృతీయ స్థానంలో ని లిచి కాంస్యం గెలిచాడు. బాలికల విభాగం 400 మీటర్లులో కావ్య (నల్లగొండ), ఎన్.జ్యోతి (నల్లగొండ), ఎం.తేజస్వి (రంగారెడ్డి జిల్లా)లు వరుసగా స్వర్ణం, రజత, కాంస్య పతకాలు గెలిచారు. రంగారెడ్డి జిల్లా జట్ల ముందంజ వాలీబాల్ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో రంగారెడ్డి జిల్లా జట్లు లీగ్ మ్యాచ్ విజయాలను నమోదు చేసుకున్నాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన బాలికల లీగ్ మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 25-20, 25-20 స్కోరుతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా 25-22, 25-23తో కరీంనగర్ జట్టుపై గెలిచింది. బాలుర లీగ్ పోటీల్లో ఖమ్మం 25-9, 25-22తో వరంగల్‌పై, మెదక్ 25-21, 25-15తో వరంగల్‌పై, నిజామాబాద్ 23-25, 25-22, 15-8తో కరీంనగర్‌పై గెలిచాయి. బాలికల లీగ్ పోటీల్లో నల్లగొండ 25-23, 25-12తో మెదక్‌పై, నిజామాబాద్ 25-21, 25-19తో కరీంనగర్‌పై, మెదక్ 22-25, 25-14, 15-9తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి. అథ్లెటిక్స్ ఫైనల్స్ ఫలితాలు: బాలుర విభాగం: 100మీ: 1.కె.నాగరాజ్ (ఖమ్మం), 2.పి.భువేష్ (రంగారెడ్డి జిల్లా), 3.బి.వినీత్ (రంగారెడ్డి జిల్లా), 1500మీ: 1.ఎ.మల్లేశం (నల్లగొండ), 2.పి.మహిపాల్ (రంగారెడ్డి జిల్లా), 3.బి.వెంకటప్ప (రంగారెడ్డి జిల్లా). హైజంప్: 1. ఆర్.ముని (నల్లగొండ), 2.కె.ఇంద్రసేన్( వరంగల్), 3. జి.కన్నారావు ( ఖమ్మం). డిస్కస్‌త్రో: 1. ఎం.రవి (కరీంనగర్). 2.జి.బాలరాజ్(మెదక్), 3.వి.శివరామ్ (రంగారెడ్డి జిల్లా). బాలికల విభాగం: 100మీ: 1.బాను చంద్రిక (ఖమ్మం), 2.కె.చైతన్య (నల్లగొండ), 3.పి.దివ్య పావని (ఖమ్మం). 1500మీ: 1.ఆర్.శిల్ప (నల్లగొండ), 2.ఎం.కావ్య (ఆదిలాబాద్), 3.జి.మహేశ్వరీ (నల్లగొండ). హైజంప్: 1. లక్ష్మీ(ఆదిలాబాద్), 2. పి.స్వాతి (కరీంనగర్), 3.వి.జ్యోత్స్న (మెదక్). షాట్‌ఫుట్: 1.హెచ్.ఫాతిమా(ఖమ్మం), 2.జె. సంధ్య (వరంగల్), 3.ఎ.శ్రావణి(ఆదిలాబాద్). -
వరంగల్‌కు పురుషుల టైటిల్
ప్రొ. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ ఎల్బీ స్టేడియం: ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల టీమ్ టైటిల్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్‌డీహెచ్‌ఏ) సౌజన్యంతో తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఫైనల్లో వరంగల్ 25-19 స్కోరుతో ఎల్బీ స్టేడియం జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో వరంగల్ జట్టు 15-12తో ఆధిక్యాన్ని సాధించింది. వరంగల్ జట్టులో అశోక్ 10 గోల్స్, ఆర్. సింగ్ 6 గోల్స్ చేశారు. ఎల్బీ స్టేడియం జట్టులో రాజ్ కుమార్, వాసు చెరో 8 గోల్స్ చేశారు. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్‌గా అశోక్ (వరంగల్) ఎంపికయ్యాడు. సెమీఫైనల్లో వరంగల్ జట్టు 15-13స్కోరుతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌పై, ఎల్బీ స్టేడియం జట్టు 12-10 స్కోరుతో నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) జట్టుపై గెలిచాయి. మహిళల చాంప్ సాయ్: మహిళల విభాగంలో సాయ్ ఎస్టీసీ (సరూర్‌నగర్) జట్టు విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం జట్టు రెండో స్థానం సాధించగా, మహర్షి విద్యా మందిర్‌కు మూడో స్థానం దక్కింది. ఫైనల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జట్టు 15-13 స్కోరుతో ఎల్బీ స్టేడియం జట్టుపై గెలిచింది. సాయ్ జట్టులో రమ్య 10 గోల్స్ చేసి బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకుంది. సెమీఫైనల్లో సాయ్ ఎస్టీసీ జట్టు 12-6తో సెయింట్ పాయిస్ కాలేజిపై, ఎల్బీ స్టేడియం 9-6తో మహర్షి విద్యా మందిర్‌పై గెలిచాయి. హాకీ విజేత సెయింట్ పీటర్స్ స్కూల్ హాకీ టోర్నమెంట్లో సెయింట్ పీటర్స్ హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. జింఖానా మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ పీటర్స్ జట్టు 1-0తో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను సెయింట్ పీటర్స్ ఆటగాడు అజహర్ సాధించాడు. సెమీఫైనల్లో సెయింట్ పీటర్స్ స్కూల్ 1-0తో విజయా హైస్కూల్ (కాప్రా)పై, భవాన్స్ జూనియర్ కాలేజి 1-0తో కేంద్రీయ విద్యాలయ (తిరుమలగిరి)పై నెగ్గాయి.