breaking news
Wang Yang
-
జిన్‌పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్‌పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్‌పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్‌పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్‌పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్‌పింగ్‌కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జిన్‌పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్‌పింగ్‌ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్‌పింగ్‌కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్‌పింగ్‌ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్‌పింగ్‌కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్‌పింగ్‌కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్‌పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్‌కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్‌పింగ్‌ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్‌పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్‌యాంగ్ త్వరలో జిన్‌పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్‌కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ స్వాతంత్ర్య వేడుకలకు ఊహించిన అతిథి
ఇస్లామాబాద్: భారత స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్కరోజు ముందు జరిగే పాకిస్తాన్ ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్‌కు ఈఏడాది ఊహించిన అతిథి హాజరుకానున్నారు. అవును.. ఆ అతిథి.. చైనా ఉన్నత నాయకుడే! చైనీస్ ప్రెసిడెంట్ జిన్‌పింగ్ సూచనమేరకు ఆ దేశ ఉపప్రధాని వాంగ్‌యాంగ్ సోమవారం(ఆగస్టు 14న) జరగనున్న పాక్ 70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే వేడుకలో ప్రధాని షాహిద్ అబ్బాసీతోకలిసి వాంగ్ పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక, రక్షణరంగాల్లో సహకారం అందిస్తూ చైనా.. పాకిస్తాన్‌కు ఆప్తమిత్రురాలిగా మారడం, అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి నిర్ణయాలనైనా చైనా వీటో చేస్తున్న తెలిసిందే. భారీ బాంబుపేలుడు.. 17 మంది మృతి పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిటీలో రద్దీ ప్రాంతంలోని బస్‌స్టాప్ వద్ద నిలిపిఉంచిన కారులో బాంబు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దుశ్చర్య ఐసిస్ పనే అయిఉంటుందని అనుమానిస్తున్నారు.