breaking news
Vulgar vocabulary
-
జ్యోతిక డైలాగ్పై విరుచుకుపడుతున్న నెటిజన్లు
-
జ్యోతిక సంభాషణలపై మండిపడుతున్న నెటిజన్లు
తమిళసినిమా: నటి జ్యోతిక సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తనేం మాట్లాడింది పాపం అనుకుంటున్నారా? నటి జ్యోతిక వివాహనంతరం 36 వయదినిలే చిత్రంతో నటిగా రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల తెరపైకి వచ్చిన మగళీర్ మట్టుం చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. చాలా కాలం తరువాత బయటి సంస్థలో నాచియార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి బాలా దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. నటి జ్యోతిక పోలీస్ అధికారిణిగానూ, జీవీ.నేరస్తుడిగానూ నటిస్తున్న చిత్రం నాచియార్. ఇందులో జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లో కొందరిపై అసభ్య పదజాలంతో తిట్టిన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీంతో విమర్శకులు, నెటిజన్లు అలాంటి సంభాషణలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పలువరు అభిమానులు దర్శకుడు బాలా చిత్రాల్లో అలాంటి సంభాషణలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే అయినా జ్యోతిక లాంటి నటి వాటిని చెప్పడానికి ఎలా అంగీకరించారని దుయ్యబడుతున్నారు. ప్రచారం కోసమే చిత్రాల్లో ఇలాంటి బూతులు పొందుపరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సార్ సభ్యులైనా ఇలాంటి అసభ్య సంభాషణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాఉండగా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటున్న నాచియార్ చిత్రం మున్ముందు ఇంకెంత సంచలనం కలిగిస్తుందో చూడాలి. -
సభలో అసభ్య మాటలా?
టీడీపీ సభ్యులపై చెవిరెడ్డి ఆగ్రహం హైదరాబాద్: శాసనసభ వేదికగా తనను అసభ్య పదజాలంతో దూషించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల అంశంపై సభలో చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి చర్చ జరగాలని నినదిస్తున్న సమయంలో ప్రతిగా అధికార పక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. స్పీకర్ అనుమతితో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయగా, అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడానికి ఉపక్రమించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో చెవిరెడ్డి ప్లకార్డుతో పోడియం వద్ద తన నిరసన తెలియజేస్తుండగా, అధికార పక్షం సభ్యులు కొందరు.. అసభ్య పదజాలంతో.. కెమెరాకు అడ్డంగా ఉన్నావు... తప్పుకో అంటూ ఆయన్నుద్దేశించి గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో ఇరుపక్షాల వాగ్వాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి తలెత్తింది. ప్లకార్డు ప్రదర్శిస్తున్న తనపై అసభ్య పదజాలంతో దూషించమేంటని భాస్కర్‌రెడ్డి ఆగ్రహం ప్రదర్శించారు. మీరు టీవీల్లో కనిపించడానికి ఈ రకంగా అసభ్య పదజాలంతో దూషిస్తారా అని మండిపడ్డారు. ఆ సమయంలో సభ్యుల మధ్య పరస్పరం వాగ్యుద్ధం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సభ్యులు సర్దిజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. శాంతి భద్రతల అంశంపై సభలో చర్చ జరగాలని ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిర సనను వ్యక్తం చేస్తుంటే తోటి సభ్యుడన్న గౌరవం లేకుండా టీడీపీ సభ్యులు తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి విషయాల్లో స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యుల హక్కులను కాపాడాలని చెవిరెడ్డి మీడియాముందు పేర్కొన్నారు.