భార్యను బండరాయితో మోది చంపిన భర్త
రేపల్లె రూరల్: గుంటూరు జిల్లా రేపల్లె రూరల్ మండలం నల్లారిపాళెం గ్రామంలో భార్యను బండరాయితో మోది హత్య చేశాడో భర్త. గ్రామానికి చెందిన వినోదమ్మ(58)ను ఆమె భర్త జాముడు కు గత కొంత కాలంగా కలహాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం ఉదయం బండరాయితో తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపల్లె రూరల్ ఎస్ఐ సుబ్రమణ్యం సంఘటన స్థలాన్ని పరిశీలించి వినోదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. జాముడు పరారీ లో ఉన్నాడు.