breaking news
Village Celebration
-
అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం
తాడేపల్లిగూడెం రూరల్ : గ్రామదేవతలు శనివారం సాయంత్రం ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజులుగా అమ్మవారి ప్రతిరూపమైన గరగలను మాధవరం, అప్పారావుపేట, జగన్నాథపురం, దండగర్ర, ఎల్.అగ్రహారం గ్రామాల్లో ఊరేగించారు. శనివారం అమావాస్య కావడంతో అమ్మవార్లు ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినమైన ఆదివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాల వద్ద ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం స్థానిక 6, 11 వార్డుల మధ్య వేంచేసియున్న దానేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. 4వ వార్డు జీఎస్ఆర్ హైస్కూలు సమీపంలోని పుంతలో ముసలమ్మవారి ఊరేగింపు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అమ్మవారిని ఆదివారం ఊరేగించనున్నారు. కనకవయ్యారమ్మ, వీర -
పాతకాలపు పెళ్లి
ఆధునికత పూర్తిగా లోబరుచుకున్నాక, కోల్పోతున్న సంప్రదాయాలపై మనసు మళ్లడం సహజమే! బల్గేరియాలో ఇదే జరిగింది. వాళ్లు ఏకంగా పదిహేడో శతాబ్దంలో అక్కడ పెళ్లి ఎలా జరిగేదో అలా తిరిగి ప్రదర్శించారు. పనిలో పనిగా ఒక జంటకు పెళ్లి కూడా చేశారు. రజ్గ్రాడ్ నగరానికి సమీపంలోని ఒక గ్రామ వేడుకలో భాగంగా జరిగిన ఈ శుభకార్యంలో వందలాది బల్గేరియన్లు తమ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించారు. ఆచారంగా చిరు గంటలు మోగించడం, వధూవరులకు మేలు చేయాలని పొట్టేలును బహూకరించడం, బృందనాట్యం చేయడం, సమష్టిగా విందారగించడం... అంతా కన్నులపండువగా జరిగింది. ఒంటె గొర్రె పరిమాణానికి గొర్రెలాగానూ, చూడ్డానికి ఒంటెలాగానూ కనిపిస్తున్న ఈ జీవిని అల్పకా అంటారు. ఒంటె జాతికే చెందినదేగానీ అందులో చిన్నరకం. దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫొటో మాత్రం ఐరోపాలో తీసింది. ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ రాష్ట్రంలోనిది. వేసవి ప్రవేశించే సమయంలో వాటికి ఇలా శుభ్రంగా బొచ్చు గొరిగేస్తారు. ఆ ఉన్నితో రకరకాల దుస్తులు తయారవుతాయి. క్షవరం తర్వాత మెలానీ విట్టుమ్ తన వ్యవసాయ క్షేత్రంలో అల్పకాలకు ఇలా స్నానం చేయిస్తోంది. ఇక్కడ సంబంధం లేని విషయం ఒకటి. అల్పకాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఒకటి వేసిన పేడ మీదే అన్నీ వచ్చి వరుసగా వేస్తాయి. తప్పిపోతే బాగుండు! ఏ చిక్కూలేకపోతే జీవితంలోని మజా అర్థంకాదు. చిక్కుపడాలి, దాని ముడి విప్పాలి. అప్పుడుగానీ బతికిన అనుభూతి గాఢంగా పెనవేసుకోదు. అది అర్థం చేయించడానికే కాబోలు ఈ ప్రహేళికా నిర్మాణాలు! అమెరికాలోని ‘నేషనల్ బిల్డింగ్ మ్యూజియం’లోని ‘మేజ్’ ఇది. రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లో ఉంది. ఇందులో సందర్శకులు తప్పిపోతూ సంబరపడిపోతుంటారు. బయటపడ్డాక మరింత సంబరపడతారు.