breaking news
Vijayalaksmi
-
చప్పట్లు కొడితే అవినీతి పోదు
ఒంగోలు, న్యూస్‌లైన్: ‘అపరిచితుడు సినిమా చూసో....అన్నా హజారే..కేజ్రీవాల్‌లను టీవీలో చూసో చప్పట్లు కొడితే అవినీతిపోదని’ మెప్మా ఎండీ అనితా రామచంద్ర అన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉంటూ పేదవాడి దారిద్య్రాన్ని పారదోలేందుకు దృష్టిసారిస్తే అవినీతి దానంతటదే పోతుందని పేర్కొన్నారు. స్థానిక మెప్మా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మెప్మా ఇన్చార్జ్ పీడీ పద్మజ, ఒంగోలు నగర కమిషనర్ విజయలక్ష్మి, రాష్ట్ర స్పెషలిస్టు రాజశేఖరరెడ్డి, జిల్లా స్పెషలిస్టు టీ.హరిప్రసాద్‌రెడ్డి తదితరులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక పెన్షన్లలో సైతం చాలామంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపించినపుడు గుండె తరుక్కుపోతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే రెండు వందల కోసం వారు పడే తపన సాధారణమైంది కాదని, అటువంటి వారిపట్ల దయ, ప్రేమతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పలువురు సీవో(కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లు ఇంకా పొదుపు సంఘాల్లో ఉండడం సరైన విధానం కాదన్నారు. సీవోలకు ప్రస్తుతం *8 వేలు జీతం ఇస్తున్నందున వారు పొదుపు గ్రూపుల్లో ఉండడం వల్ల వాటిలో ఉండే పేద మహిళల అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు పొదుపు గ్రూపుల్లో ఉన్నవారు కొత్తగా ఎటువంటి రుణాలు గ్రూపుల ద్వారా తీసుకోవద్దని, ఎవరైనా ఇంకా తీసుకుంటుంటే మాత్రం వారిని ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలలో ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయించడంలో బాగా వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లో రూ 6 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న మొత్తంలో అసలు ఎంతో నిర్థారించి అందులో వాయిదాను నిర్ణయించాలన్నారు. వాయిదాను మాత్రమే చెల్లించాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ అధిక మొత్తం జమపడనీయకుండా మెప్మా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఏ గ్రూపు అయినా అధిక మొత్తం వాయిదా కింద చెల్లిస్తే వారికి వడ్డీ లేని రుణం అందదన్నారు. తప్పనిసరిగా కచ్చితమైన ఇన్స్టాల్మెంట్ మాత్రమే చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలు చెల్లించాల్సిన వడ్డీని మెప్మానే నేరుగా బ్యాంకు అకౌంట్‌కు జమ చేస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయంలో వెంటనే స్వయం సహాయక సంఘాలను అప్రమత్తం చేయాలని సూచించారు. కొత్తగా నగర పంచాయతీలుగా మారిన చీమకుర్తి, అద్దంకి, గిద్దలూరు, కనిగిరిలలోని సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పలు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని అటువంటి వాటికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. లేని పక్షంలో సాంకేతిక సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మెప్మా ఎండీ అనితా రామచంద్ర పేర్కొన్నారు. సమావేశంలో సమైక్య సంఘాల అధ్యక్షులతో కూడా ఎండీ మాట్లాడారు. -
ఉత్సాహంగా సాక్షి పండుగ సంబరాలు
=ఐదో డ్రా విజేత రేవంత్ = లక్కీ డ్రా తీసిన నాలుగో డ్రా విజేత విజయలక్ష్మి = ప్రధాన స్పాన్సర్లు కళానికేతన్, టీఎంసీ విజయవాడ, న్యూస్‌లైన్ : సాక్షి నిర్వహిస్తున్న పండుగ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సంబ రాల్లో భాగంగా శుక్రవారం ఎంజీ రోడ్డులోని కుశలవ టీవీఎస్ షోరూమ్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. నాలుగో డ్రా విజేతగా నిలిచిన నగరానికి చెందిన టి.విజయలక్ష్మి లక్కీ డ్రా తీసి బంపర్ ప్రైజ్ విజేతను ఎంపిక చేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో వినియోగదారులు, షోరూమ్ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన ఈ డ్రాలో కళానికేతన్లో దుస్తులు కొనుగోలు చేసిన ఎన్.రేవంత్ (13076) బంపర్ ప్రైజ్ విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు. లక్కీ విన్నర్‌తో పాటు మరో ఆరుగురు విజేతలను ఎంపికచేసి ఎల్ఈడీ టీవీ, ఫర్నిచర్, కెమెరా, సెల్ఫోన్లు అంది స్తున్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి నిర్వహిస్తున్న పండుగ సంబరాల్లో భాగంగా ఇప్పటి వరకూ ఐదు డ్రాలు పూర్తయ్యాయి. ఈ డ్రాల్లో ఐదుగురు లక్షాధికారులను ఎంపిక చేశారు. జనవరి 5వ తేదీ వరకూ సంబరాలు కొనసాగుతాయి. రోజూ లక్కీ డ్రా తీసి 15 మందిని లక్షాధికారులుగా ఎంపిక చేస్తారు. ఈ పండుగ సంబరాలకు కళానికేతన్, టీఎంసీ ప్రధాన స్పాన్సర్లు వ్యవహరిస్తున్నాయి. నగరంలో సాక్షి సంబరాలు జరుపుతున్న ప్రతి షోరూమ్‌లో కొనుగోలు చేసినవారికి అందచేసిన కూపన్ల ఆధారంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఐదో రోజు లక్కీ డ్రాలో ముఖ్యఅతిథిగా టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఏరియా మేనేజర్ ఎస్.సీతారామశాస్త్రి, టెరి టరీ మేనేజర్లు జె.నరేష్కుమార్, వై.వి.రమణ, కుశలవ టీవీఎస్ డెరైక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) బి.వెంకటరెడ్డి, సాక్షి రీజినల్ మేన జర్(యాడ్స్) సీహెచ్. అరుణ్‌కుమార్, సాక్షి యాడ్స్ మేనేజర్ జె.ఎస్.ప్రసాద్ పాల్గొన్నారు. ఐదో లక్కీ డ్రా విజేతలు వీరే.... బంపర్ ప్రైజ్ విజేతగా కళానికేతన్ వినియోగదారుడు ఎన్.రేవంత్(13076) రూ.లక్ష గెలుచుకున్నారు. బిగ్‌సీ కస్టమర్ సురేష్(15908) ప్రథమ బహుమతి ఎల్ఈడీ టీవీ, అదే షోరూమ్ వినియోగదారుడు షేక్ జాన్ సైదులు(07589) ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్ గెలుపొందారు. కళానికేతన్ కస్టమర్ నాగబాబు(12713) తృతీయ బహుమతిగా బ్రాండెడ్ కెమెరా, అదే షోరూమ్ వినియోగదారులు కె.కల్యాణి(12699), సుభాషిణి (12675), టీఎంసీ కస్టమర్ పి.సురేంద్రరెడ్డి(07162) ప్రోత్సాహక బహుమతులుగా సెల్ ఫోన్లను గెలుచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది సాక్షి పండగ సంబరాల్లో భాగంగా నిర్వహించిన డ్రాలో నాకు ప్రైజ్ లభించడం చాలా ఆనందంగా ఉంది. కళానికేతన్లో షాపింగ్ చేసి బయటకు వస్తుండగా సాక్షి పండుగ సంబరాలు కూపన్ ఇవ్వడంతో దానిని పూరించి డ్రాప్ బాక్స్‌లో వేశాం. సాక్షి నుంచి గురువారం ఫోన్ చేసి, నేను లక్కీడ్రా విజేతగా ఎంపికయ్యానని చెప్పారు. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన సాక్షికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. - టి.విజయలక్ష్మి, నాలుగో డ్రా బంపర్ ప్రైజ్ విజేత ప్రతి పెస్టివల్ సీజన్లోనూ నిర్వహించాలి సాక్షి నిర్వహిస్తున్న పండుగ సంబరాల కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ కార్యక్రమం బిజినెస్‌కు కూడా చాలా అడ్వాంటేజ్‌గా ఉంటోంది. ఇలా ప్రతి ఫెస్టివల్ సీజన్లోనూ నిర్వహిస్తే బాగుం టుంది. కస్టమర్ షాపింగ్ చేయడమే అర్హతగా కూపన్లు ఇచ్చి అందరి సమక్షంలో డ్రా తీసి విజేతను ప్రకటించడం వండర్ఫుల్. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన సాక్షికి అభినందనలు తెలియజేస్తున్నా. - ఎస్.సీతారామశాస్త్రి, టీవీఎస్ కంపెనీ రీజినల్ మేనేజర్ విజేతను రెండురోజులు సెలబ్రిటీ చేస్తున్నారు సాక్షిలో బంపర్ ప్రైజ్ పొందిన విజేతను రెండు రోజులు సెలబ్రిటీని చేస్తున్నారు. ప్రైజ్ పొందిన రోజు ఫొటోతో ప్రచురించడంతో పాటు, మరుసటి రోజు వారితోనే డ్రా తీయించడం గొప్ప విషయం. బంపర్ ప్రైజ్ పొందిన వారితోనే సైతం డ్రా తీయించడం, ఆటో మొబైల్, సెల్‌ఫోన్, రెడిమేడ్స్, హోటల్స్ ఇలా అన్ని రంగాల్లో కస్టమర్స్‌ను పరిగణనలోకి తీసుకుని డ్రా తీయడం బాగుంది. - బి.వెంకటరెడ్డి, డెరైక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్, కుశలవ టీవీఎస్