breaking news
Vetapaleam mandal
-
కఠారివారిపాలెంలో ఉద్రిక్తత..
సాక్షి, ప్రకాశం జిల్లా: వేటపాలెం మండలం కఠారివారిపాలెంలో మరోసారి మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. వాడరేవు మత్స్య కారులు బల్ల వలలు వాడుతున్నారని ఓ పడవని కఠారివారిపాలెం మత్స్యకారులు పట్టుకున్నారు. తమ వారిని పట్టుకుని నిర్భందించడంపై వాడరేవు మత్స్యకారులు ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సముద్రంలో చేపల వేటకి బల్ల వలలు వినియోగంపై గత కొంత కాలంగా మత్స్యకార గ్రామాల మధ్య వివాదం జరుగుతోంది. (చదవండి: భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) సమస్య పరిష్కారం కోసం కఠారివారిపాలెంలో మత్స్యకారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అధికారుల మాట పట్టించుకోకుండా వాడరేవు మత్స్యకారుల బోటును కఠారివారిపాలెం మత్స్యకారులు తీరానికి తెచ్చారు. ఇది ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పై కూడా దాడి చేశారు. (చదవండి: కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య) -
ప్రేమపేరుతో పైశాచికత్వం
చీరాల: ప్రేమపేరుతో ఓ మైనర్ బాలికను వలలో వేసుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను కెమెరాలో రహస్యంగా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడంతో పాటు, స్నేహితుల సెల్ఫోన్లకు పంపిన మాజీ కౌన్సిలర్ పుత్రరత్నం పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వేటపాలెం మండలంలోని గ్రామం నుంచి ఓ కుటుంబం పిల్లల చదువు నిమిత్తం చీరాల పట్టణానికి వచ్చి స్థిరపడింది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక(17)పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ మూడో కుమారుడు జునైద్(25) కన్నుపడింది. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ఇంటర్నెట్లో పెట్టడంతో పాటు, స్నేహితుల సెల్ఫోన్లకు సైతం పంపిచాడు. ఈ దారుణం జరిగి నెల రోజులు దాటింది. బాలిక తండ్రికి విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. చీరాల వన్‌టౌన్ పోలీసులు ఆ మృగాడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు జునైద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వన్‌టౌన్ సీఐ భీమానాయక్ మాట్లాడుతూ నిందితుడిపై నిర్భయ చట్టం, అత్యాచారం, సైబర్ నేరం కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.