breaking news
venkataswami
-
కరీంనగర్లో నకిలీ బాబా అరెస్ట్
కరీంనగర్: పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాస్తు పేరుతో ప్రత్యేక పూజలు చేయించి డబ్బులు దండుకుంటున్న నకిలీ బాబాను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటస్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాబా అవతారమెత్తి అమాయక ప్రజలను దోచుకుంటున్నాడు. వ్యవసాయ భూములను పరిశీలించి అందులో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ప్రత్యేక పూజల పేరుతో లక్షల్లో డబ్బు దండుకొని చివరకు తన తీసుకొచ్చిన ఇత్తడి విగ్రహాలను భూ యజమానికి తెలియకుండా ఏదో ఓ ప్రాంతంలో పాతి పెట్టి అక్కడ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అనంతరం వీటిని ప్రత్యేక మూలికలతో శుద్ధి చేయాలి.. దానికి చాలా ఖర్చు అవుతుందని నమ్మిచి వారి వద్ద నుంచి దండిగా డబ్బు లాగి మోసం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఈ రోజు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఇత్తడి ప్రతిమలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
అప్పులకోసం ఆస్తుల జప్తు
ఆత్మకూర్, న్యూస్‌లైన్: తీసుకున్న రుణానికి చెందిన బకాయిలను చెల్లించాలంటూ జిల్లా సహకార బ్యాంకు అధికారులు సం బంధితుల వస్తువులను జప్తు చేయడంతో సోమవారం ఆత్మకూర్ మం డలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ గ్రామానికి చెందిన 80మంది డీసీసీబీ బ్యాంకు, విండో సహకార సంఘం ద్వారా 2010-11లో రూ.కోటికిపైగా రుణాలు పొందారు. తదనంతరం వారు రున బకాయిలను చెల్లిం చకపోవడంతో బ్యాంకు అధికారులు విండో సిబ్బంది గ్రామానికి చేరుకొని వారి సామాన్లను జప్తు చేశారు. దీంతో లబ్దిదారులు, బ్యాంకు అధికారుల మధ్య వాగ్వివాదం చో టు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్లు ఎలా జప్తు చేస్తారని గ్రామానికి చెందిన రామకృష్ణ, వెంకటేష్, మొగులయ్యలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్న ఇంటి తలుపులు, టీవీలు, తీసుకెళితే అవమానంతో తలెత్తుకోగలమా? అని నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెబుతూ గతంలోనే నోటీసులు అం దించామని, అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో నే సామాన్లు జప్తు చేస్తున్నామన్నారు. తీసుకున్న బకాయిలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఈ వ సూళ్ల కార్యక్రమంలో డీసీసీబీ డీజీఎం వెంకట స్వామి, ఆత్మకూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ ఎండీ యూసుఫ్, ఫీల్డ్ ఆఫీసర్ శేఖర్, అదికారులు జగదీశ్వర్‌రెడ్డి, నరేష్, మాసన్న, రఘులు ఉన్నారు.