breaking news
Venkataraju
-
బాబు ఫ్రీ బస్సుపై.. టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు
-
ఏలూరులో మెడికో ఆత్మహత్య
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఏలూరులో ఓ మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దానవాయిపేటకు చెందిన డాక్టర్ వెంకటరాజు కుమారుడు బలభద్ర రితేష్(24) తన హాస్టల్ 3వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ల హౌస్ సర్జన్‌గా చేస్తున్న రితేష్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.