breaking news
Venkata Pratap Apparao
-
‘మూడు నెలల పాలనను ప్రశ్నించడం హాస్యాస్పదం’
సాక్షి, కృష్ణా : టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. తమ పాలనలో ఏం చేశారో చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశ్నించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలనను చంద్రబాబు అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీలోని విద్యార్థుల కోసం కేటాయించిన రూ.185 కోట్ల సొమ్మును.. చంద్రబాబు తన స్వార్థం కోసం పసుపు-కుంకుమ పథకానికి వాడుకున్నారని ఆరోపించారు. అటువంటి సీఎం భారతదేశంలో ఎక్కడా లేడని దుయ్యబట్టారు. అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లించకుండా చంద్రబాబు సాగించిన పాలనను ఆయన గుర్తుచేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు ఎంతమాత్రం లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ మూడు నెలల పాలనపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఇతర దేశాల్లోని నగరాలకు ధీటుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. -
నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లను
నూజివీడు : నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని, నూజివీడును ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగిందని, దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన తోడ్పాటు చాలా గొప్పదని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. వాక్‌విత్ జగన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రజల మనిషినని, నిత్యం ప్రజలలో ఉండేవాడినని, రాబోయే ఎన్నికలలో తిరిగి గెలిచి నూజివీడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. -
అధికారం ఉన్నా.. లేకున్నా..జగన్ వెంటే నడుస్తా : మేకా
జిల్లాలో జగన్ వెంట నడిచిన మొదటి వ్యక్తి నేనే నూజివీడుకు వైఎస్సార్ చేసిన అభివృద్ధి చరిత్రాత్మకం ఓటర్ల మనోభావాలు దెబ్బతీసే పని చేయను కొందరు చేసే దుష్ర్పచారాలు నమ్మొద్దు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నూజివీడు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినా, అవ్వకపోయినా ఆయన వెంటే నడుస్తానని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. మేకా ప్రతాప్ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోందంటూ ఒక పత్రిక (సాక్షి కాదు)లో వచ్చిన కథనంపై స్పందిస్తూ సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2010లో జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాగానే జిల్లాలో ఆయన వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తి తానేనని గుర్తుచేశారు. అధికారం ఉందా, లేదా, భవిష్యత్‌లో అధికారంలోకి వస్తుందా, రాదా అని ఏనాడూ తాను ఆలోచించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూజివీడు ప్రాంతానికి చేసిన అభివృద్ధి చరిత్రలో మిగిలిపోయిందని చెప్పారు. తాను ఏదడిగితే అది నూజివీడుకు చేశారని, అలాంటి వ్యక్తి కుటుంబాన్ని తాను వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, తనకు ఓటేసి గెలిపించిన ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే పనులు చేయనని తెలిపారు. తాను టీడీపీలోకి వెళ్తున్నానని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. తాను మాట తప్పే మనిషిని కాదని, తనది పార్టీలు మారి తప్పులు చేసే స్వభావం కాదని తెలిపారు. ‘ఇదే పార్టీలో ఉండి నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను గెలుచుకున్నాం.. ప్రజలు నాపై విశ్వాసం ఉంచి నేను నిలబెట్టిన వ్యక్తులను గెలిపించారు.. అలాంటి ప్రజలను నేను ఎట్టి పరిస్థితులలోను మోసం చేయను’ అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. రాబోయే రోజుల్లో అధికారం తథ్యం... రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి అధికారం తథ్యమని ప్రతాప్ అన్నారు. ఈ ఐదేళ్లూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. ప్రతిపక్ష పార్టీగా మెరుగైన సీట్లే వచ్చాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు పాల్గొన్నారు.