breaking news
Vellore Collector
-
కలెక్టర్‌కు డమ్మీ టైమ్ బాంబు పార్శిల్
వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని తపాల బాక్సులో వేలూరు కలెక్టర్ పేరుపై వచ్చిన పేలుడు వస్తువులతో కూడిన డమ్మీ టైమ్ బాంబు పార్శిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. వేలూరు కోర్టు ఎదుట తపాల కార్యాలయం ముఖ ద్వారం వద్ద తపాలా బాక్సును ఏర్పాటు చేశారు. ఈ బాక్సులో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తపాలా సిబ్బంది బాక్సును తెరిచి ఉత్తరాలను తీసుకున్నాడు. ఈ సమయంలో బాక్సులో ప్యాకింగ్ చేయబడిన ఒక పార్శిల్ ఉంది. దీనితో పాటు ఒక మెమరీ కార్డు, ఒక గడియారం అందులో ఉన్నది. ఈ బాక్సుపై టు అడ్రసు వేలూరు కలెక్టర్ పేరుతో ఉండడంతో గమనించిన తపాలా సిబ్బంది వెంటనే పార్శిల్‌ను తీసి బయటకు వేశారు. ఆ సమయంలో పార్శిల్ చినిగిపోవడంతో అందులో ఉన్న వైర్లు బయటకు కనిపించడంతో ఆశ్చర్య పోయిన సిబ్బంది తపాలా అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సత్వచ్చారి పోలీసులు పార్శిల్ వద్దనున్న మెమరీ కార్డు, గడియారంను స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్లో వైర్లు తెలుస్తున్నందున బాంబు ఉండవచ్చునని బాంబు స్క్వాడ్ వైర్లను కత్తరించారు. అనంతరం బాక్సును వేర్వేరుగా విప్పి చూడగా అందులో మూడు డిటోనేటర్లు, మూడు చిన్న వైర్లు ఉండడంతో పోలీసులు ఏమి చేయాలో తె లియకుండా వెంటనే వాటిని పోలీసుల వ్యాన్‌తో తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ సెంథిల్ కుమారి నేరుగా వచ్చి పరిశీలించి వీటిపై విచారణను వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశించారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నందగోపాల్
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టర్‌గా నందగోపాల్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కలెక్టర్‌గా ఉన్న రాజంద్రరత్నూ బదిలీ కావడంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బదిలీ అయిన నందగోపాల్‌ను తిరిగి వేలూరు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గురువారం ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయడం సహజమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరణ సమయంలో గ్రామీణాభివద్ధిశాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసన్, ప్రత్యేక అధికారి రాజేంద్రన్, అధికారులు పాల్గొన్నారు.