breaking news
veeranna gutta
-
దేవుడి పేరే ఊరి పేరైంది
నిజామాబాద్(బోధన్): వీరన్నగుట్ట గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల కిందట గుట్టమీద ఉన్న బండరాయి పగిలి రెండుగా విడిపోగా వాటి మధలో వీరభద్రస్వామి విగ్రహం బయటపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయంలో పూజలు ప్రారంభించారు. కొంతకాలానికి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో చెరుకు నరికేందుకు పలు ప్రాంతాలకు చెందిన కూలీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.ముందుగా సాటాపూర్ ఫారంగా పంచాయతీ ఏర్పాటైంది. కాలక్రమేణ జనాభా పెరగడంతో వీరన్నగుట్టగా దేవుడిపేరుతో గ్రామానికి పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి జరిగిన మూడో రోజు ఇక్కడి ఆలయంలో రథోత్సవం, జాతరను వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా వీరభద్రుడు విరాజిల్లుతున్నాడు. -
రెంజల్లో కార్డన్ సెర్చ్
రెంజల్(నిజామాబాద్): రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో గురువారం ఉదయం (నిర్బంధ తనిఖీ) కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బోధన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటగిరి, బోధన్, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలతో పాటు పలువురు ప్రత్యేక సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి లెసైన్స్‌లు లేని 12 బైక్‌లను, ఓ ట్రాక్టర్‌ను ఇప్పటి వరకూ సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.