breaking news
Varun motor showroom
-
వరుణ్ మోటార్స్ షోరూమ్‌లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: వరుణ్ మోటార్స్ గ్రూపు షోరూమ్‌ల్లో అవకతవకలు జరిగినట్లు రవాణా శాఖ తనిఖీల్లో ప్రాథమికంగా వెల్లడైంది. పలు ఫిర్యాదుల ఆధారంగా విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, విజయనగరం, శ్రీకాకుళంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్‌ల్లో రవాణా శాఖ గురువారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. 300 వాహనాలను టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా డెలివరీ చేసినట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. అలాగే రవాణా శాఖకు ఎటువంటి సమాచారం లేకుండా చాలాచోట్ల సబ్ డీలర్లతో వాహనాల విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. అక్రమాలు బహిర్గతమైన నేపథ్యంలో వరుణ్ మోటార్స్ గ్రూప్స్ షోరూమ్‌ల్లో వాహనాల విక్రయాలు జరగకుండా లాగిన్‌ను రవాణా శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మరింత లోతుగా విచారణ చేశాక అక్రమాలపై మరిన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. (చదవండి: లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు) -
సాక్షి పండుగ సంబరాలు
వరుణ్ మోటార్స కస్టమర్‌కు బంపర్ ప్రైజ్ {పధాన స్పాన్సర్ కళానికేతన్ కో-స్పాన్సర్స్ మిత్రాహోండా, సోనోవిజన్, మారుతీ సుజుకీ, టీవీఎస్ రింగ్‌రోడ్డు రోడ్డు వరుణ్ మోటార్స్‌లో మూడో డ్రా డ్రా తీసి విజేతను ప్రకటించిన రెండో డ్రా విజేత సుశీల ఉత్సాహంగా సాక్షి సంబరాలు సాక్షి పండుగ సంబరాలు మూడోరోజు డ్రా శుక్రవారం రింగ్‌రోడ్డులోని వరుణ్ మోటార్స షోరూమ్‌లో రెండో రోజు బంపర్ ప్రైజ్ విజేత సూరపనేని సుశీల ఈ డ్రా తీసి మూడోరోజు లక్షాధికారిని ఎంపిక చేశారు. విజయవాడ : సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాల్లో భాగంగా ఆహ్లాదభరితమైన వాతావరణంలో శుక్రవారం మూడో రోజు డ్రా నిర్వహించారు. రింగ్‌రోడ్డు సమీపంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్‌లో నిర్వహించిన ఈ డ్రాలో రెండో డ్రా విజేత సూరపనేని సుశీల లక్షాధికారి విజేతను ఎంపిక చేశారు. వరుణ్ మోటార్స్ కస్టమర్ కె.లవకుమార్(04140) బంపర్‌ప్రైజ్ విజేతగా నిలిచి రూ.లక్ష నగదు బహుమతి గెలుచుకున్నారు. తర్వాత పలువురు కస్టమర్లు డ్రా తీసి, ఫస్ట్. సెకండ్, థర్డ్ ప్రైజ్‌ల విజేతలతో పాటు, మూడు కన్సొలేషన్ బహుమతుల విజేతలను ఎంపిక చేశారు. సాక్షి నిర్వహిస్తున్న ఈ డ్రా ఎంతో పారదర్శకంగా ఉందని పలువురు కస్టమర్లు కొనియాడారు. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తుంటారని, అలాంటి సమయంలో డ్రా నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. సాక్షి పండుగ సంబరాలు జనవరి 6 వరకూ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక లక్షాధికారిని ఎంపిక చేస్తుంది. పండుగ సంబరాలకు స్పాన్సర్లు వ్యవహరిస్తున్న ఒక షోరూమ్‌లో కస్టమర్ల సమక్షంలో డ్రా తీసి విజేతలను ఎంపిక చే స్తారు. సాక్షి రీజినల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్.అరుణ్‌కుమార్, సాక్షి యాడ్స్ మేనేజర్ జేఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రధాన స్పాన్సర్‌గా కళానికేతన్ వ్యవహరిస్తుండగా, కో స్పాన్సర్లుగా సోనోవిజన్, మిత్రాహోండా, వరుణ్మారుతీ, మిత్రా మారుతీ, టీవీఎస్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి.