breaking news
Varotsavalu Maoist Andhra-Odisha border
-
AOB: రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
పాడేరు/ముంచంగిపుట్టు: ఏవోబీ వ్యాప్తంగా బుధవారం నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ వారోత్సవాలను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఆంధ్రా పోలీసు యంత్రాంగమంతా ఈ వారోత్సవాలపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల పోలీసు బలగాలన్నీ ఇప్పటికే ఒడిశా కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని అన్ని పోలీసు స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసేంత వరకు రెడ్ అలెర్ట్ అమలు చేస్తున్నారు. ఏజెన్సీలోని దారకొండ, పెదవలస, బలపం, నుర్మతి, రూడకోట అవుట్‌పోస్టుల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు అధికమయ్యాయి. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఏవోబీ వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఆయా మారుమూల గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి, పాడేరు ఏఎస్పీ జగదీష్ ఈ రెండు సబ్ డివిజన్లలో పోలీసు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూంబింగ్ చర్యలు, మండల కేంద్రాల్లోని వాహనాలు, ఇతర తనిఖీలను సమీక్షిస్తున్నారు. కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ముమ్మర తనిఖీలు చేస్తున్న బలగాలు డాగ్, బాంబు స్క్వాడ్ల తనిఖీలు ముంచంగిపుట్టు మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దులో డాగ్, బాంబు స్క్వాడ్లతో పోలీసు బలగాలు కల్వర్టులు, వంతెనలు తనిఖీలు చేస్తూ వాహన రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. గూడెంకొత్తవీధి మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారపార్టీ నేతలపై దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్త చర్యలు చేపట్టారు. జి.మాడుగుల మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీస్, బాంబ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. చింతపల్లి–జీకే వీధి రహదారి మార్గంలో వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతగిరి మండలంలోని ములియగుడలోని జంక్షన్ వద్ద అరకు–విశాఖ ప్రధాన రహదారిలోని వాహనాలను ఆపి క్షుణంగా పరిశీలించారు. -
పీఎల్జీఏ ప్రశాంతం
ముగిసిన అమరవీరుల వారోత్సవాలు పట్టుసాధించిన పోలీసు యంత్రాంగం కలిసొచ్చిన ముందస్తు వ్యూహం పాడేరు/కొయ్యూరు/జీకేవీధి : మావోయిస్టు అమరవీరుల(పీఎల్జీఏ)వారోత్సవాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ప్రశాంతంగా ఆదివారంతో ముగిశాయి. దళసభ్యులు అక్కడక్కడ స్థూపాలు ఏ ర్పాటు చేసి స్థానికులతో కలిసి అమరవీరుల కు నివాళులర్పించినప్పటికీ ఎటువంటి వి ధ్వంసకర సంఘటనలకు పాల్పడిన దాఖ లాలు లేవు. అన్ని వైపుల నుంచి పోలీసుల కూంబింగ్ ఉధృతంతో మావోయిస్టులు వారోత్సవాల నిర్వహణకు అవకాశం లేకుండాపోయింది. గూడెంకొత్తవీధి మండలం కుంకంపూడిలో దళసభ్యులు 30 అడుగుల భారీ స్తూపం నిర్మాణ పనులు చేపట్టారు. అది పూర్తయ్యే తరుణంలోనే దళ సభ్యుడు కొర్రా సీతన్న, గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తుగా చేపట్టిన వారి వ్యూహరచన కలిసొచ్చింది. ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, కొయ్యూరు, జి.మాడుగుల, చింతపల్లిల్లో ఎక్కడా వారోత్సవాల ఊసు లేదు. వారోత్సవాలకు ముందు నుంచే యంత్రాంగం అప్రమత్తమైంది. మారుమూల గూడేల్లోని గిరిజనులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరించొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గిరిజనులు గ్రామాలకే పరిమితమయ్యారు. జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్, నర్సీపట్నం ఓఎస్డీ ఎఆర్ దామోదర్ సైతం మావోయిస్టు ప్రభావిత పోలీసు స్టేషన్లు సందర్శించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో బలగాలు గాలింపు చేపట్టాయి. పకడ్బందీ ప్రణాళిక: ఎస్పీ వారోత్సవాల భగ్నానికి పక డ్బందీ ప్రణాళికను అమలు చేసి మంచి ఫలితం సాధించామని రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఆదివారం ఫోన్లో సాక్షికి తెలిపారు. భారీస్థాయిలో కూంబింగ్ చేపట్టామన్నారు. ఒడిశా సరిహద్దులోనూ బలగాలు జల్లెడ పట్టాయన్నారు. వారోత్సవాలను పూర్తిగా అడ్డుకున్నామన్నారు. మావోయిస్టులకు స్థానిక గిరిజనులు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. మావోయిస్టులపై వ్యతిరేకత నెలకొందని గిరిజనులంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని తెలిపారు.