breaking news
V Chamundeshwarnath
-
IPL: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎంపికయ్యారు. ఈ కౌన్సిల్లో అరుణ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా ఇతర సభ్యులు కాగా... ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) తరఫున చాముండి ప్రాతినిధ్యం వహిస్తారు. 65 ఏళ్ల చాముండి ఆంధ్ర జట్టు 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023–24 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన పద్దులతో పాటు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు కూడా ఈ ఏజీఎంలో ఆమోదముద్ర వేశారు. మరో వైపు వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసిన కొత్త ప్రతిపాదనలను కూడా బోర్డు ఆమోదించింది. -
హనుమ విహారికి అభినందన
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారిని హైదరాబాద్‌లో అతను ఓనమాలు నేర్చిన సెయింట్ జాన్స్ అకాడమీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ వ్యక్తిగతంగా విహారికి ప్రత్యేక బహుమతిగా కారును అందజేశారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఏఐ హర్ష కూడా ఇందులో పాల్గొన్నారు. -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది.