breaking news
uttarakhand CM trivendra singh rawat
-
ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా గైర్‌సెయిన్
డెహ్రాడూన్: చమోలీ జిల్లాలోని గైర్‌సెయిన్ పట్టణాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్కుమార్ సింగ్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గైర్‌సెయిన్‌ను రెండో రాజధానిగా (వేసవి) మారుస్తామని మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గైర్‌సెయిన్‌కు దక్కిన వేసవి రాజధాని హోదాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వేలాది మంది ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గైర్‌సెయిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తాము అధికారంలోక వస్తే గైర్‌సెయిన్‌ను వేసవి రాజధానిగా మారుస్తామంటూ 2017 అసెంబ్లీ ఎన్నికల దార్శనిక పత్రంలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం డెహ్రాడూన్ నగరం ఉత్తరాఖండ్ పరిపాలనా రాజధానిగా కొనసాగుతోంది. -
ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్
డెహ్రాడూన్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరిపోయింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ పక్షనేత త్రివేంద్ర సింగ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ క్రిష్ణ కాంత్ పాల్ నియమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ నూతన సీఎం త్రివేంద్రను ఆహ్వానించారు. శనివారం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవనున్నారు. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు దక్కించుకున్న బీజేపీ అధికారం చేపట్టింది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నెలకొన్ని సస్పెన్స్ శుక్రవారం సాయంత్రం తొలగిపోయింది. సీఎం రేసులో ప్రకాశ్ పంత్, త్రివేంద్ర సింగ్ రావత్, సత్పాల్ మహారాజ్ ఉన్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్షనేతగా త్రివేంద్రను ఎన్నకున్నారు. ఈ క్రమంలో కొన్ని గంటల్లోనే ఉత్తరాఖండ్ గవర్నర్ క్రిష్ణ కాంత్ పాల్ బీజేపీ పక్షనేతగా ఎన్నికైన త్రివేంద్రను సీఎంగా నియమిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి మూడేళ్ల కిందటే బీజేపీలో చేరిన రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉండటంతో సీఎం పీఠం ఆయన సొంతమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేసిన అనుభవమే త్రివేంద్ర సింగ్ రావత్‌కు ప్లస్ పాయింట్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థి పరిశీలకులుగా ఇటీవల బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర తోమర్, సరోజ్ పాండేలను నియమించిన విషయం తెలిసిందే. అయితే వీరు ఎవరి పేరు సూచించినా.. చివరికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్ణయమే తుది నిర్ణయమని జేపీ నడ్డా స్పష్టం చేసినట్లే జరిగింది.