breaking news
unemployees protest
-
నిరుద్యోగ గర్జన సక్సెస్
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్ : నీళ్లు, నిధు లు, ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని.. సర్కారు మోసాన్ని ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి కరీంనగర్ జిల్లా కేంద్రంగా శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నిరుద్యోగ గర్జన’ విజయవంతం అయ్యింది. కలెక్టరేట్ ప్రాంతం అంతా వైఎస్సార్ సీపీ జెండాలో కళకళలాడింది. యువకుల బైక్‌ర్యాలీ, కళాకారుల నృత్యాల మధ్య వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. దివంగత వైఎస్సార్ విగ్రహంతో సభవరకు ర్యాలీగా వెళ్లారు. సదస్సులో పలువురు నాయకులు, నేతలు తమ వాణిని వినిపించారు. ఉద్యోగాల సాధన కోసం ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో ప్రజలకు లబ్ధిచేకూర్చిన పథకాలు.. పాలనపై కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. సభలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి. -
'40ఏళ్ల జీవోను మా ముఖాన కొట్టారు'
ఏలూరు (పశ్చిమగోదావరి) : నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటామంటూ హామీలను ఊదరగొడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని నిరుద్యోగులు ఆందోళన చేశారు. కేవలం వయోపరిమితికి సంబంధించి 40ఏళ్లు చేస్తూ జీవోను మా ముఖాన కొట్టి సీఎం చేతులు దులుపుకున్నారని వారు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆందోళనకు దిగి తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిగో ఉద్యోగ ప్రకటన.. అదిగో ఉద్యోగం అంటూ ప్రకటనలకే ఏపీ ప్రభుత్వం పరిమితమైందని వారు విమర్శించారు.