breaking news
Udhampur attack
-
ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు!
ఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ ను గురువారం ఢిల్లీకి తరలించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అతడ్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపి ప్రాణాలతో పట్టుబడిన నవేద్ యాకూబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎన్ ఐఏ కోర్టు అతడికి14 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది. ఉధంపూర్ లో ఉగ్రవాది నవీద్ ను స్థానికులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి . భారత సైన్యానికి పట్టిచ్చారు. మరో ఉగ్రవాది ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ముఖ్యంగా భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై ఆరాతీశారు. నవేద్ యకూబ్ పై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధ చట్టం, పలు సెక్షన్ల కింద నవీద్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడిన నవెద్ కు 12 మంది ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. తమ విచారణలో నవీద్ చెప్పే మాటల్లో, చేసే ప్రకటనల్లో స్పష్టత లేదని, కొత్త కథనాలను తెరపైకి తెస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. -
ఉదంపూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన
న్యూఢిల్లీ: ఉదంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ ప్రకటన చేస్తారని, దేశ భద్రతకు సంబంధించిన అంశాలతోపాటు, భవిష్యత్తులో తీసుకోనున్న చర్యలపై కూడా ఆయన ప్రకటన చేయనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఆయన ఈ ప్రకటన చేస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకోదగినదని రాజ్ నాధ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వారికి గౌరవ వందనం చేస్తున్నట్లు తెలిపారు.