breaking news
Turakapally
-
అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!
సాక్షి, మదనపల్లె టౌన్: మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆ షాపులో పనిచేసే సేల్స్‌మెన్ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మదనపల్లె–పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం (దినేష్ వైన్స్)లో ఈ నెల 28న అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడటం విదితమే. కేసు నమోదు అనంతరం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్‌కుమార్, క్లూస్ టీం బృందం సేకరించిన ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బుధవారం డీఎస్పీ రవిమనోహరాచారి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించిన వివరాలు..మద్యం షాపు చోరీ కేసులో ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన పి.సుజిత్(23) ప్రధాన నిందితుడు అని తేలింది. ఇతడు మద్యం షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ చోరీకి స్కెచ్ వేశాడు. నాలుగు రోజులుగా బ్యాంకులో మద్యం షాపు సొమ్మును జమ చేయకపోవడంతో దీనిని చోరీ చేసి అప్పులు తీర్చాలని తలపోశాడు. అదే ఊరులో ఉంటున్న తన స్నేహితుడు ఎస్. అబ్దుల్ కలాం అలియాస్ రంజాని(20) సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 28న రాత్రి మద్యం షాపు తాళాలు చాకచక్యంగా తెరచి క్యాష్ చెస్ట్లాకర్తో పాటు రూ.8,99,720 లక్షల నగదును చోరీ చేశారు. ఆ తర్వాత లాకర్‌ను మాత్రం తురకపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేశారు. చోరీ సొమ్ముతో అప్పులు తీర్చడానికి రుణదాతల వద్దకు వెళ్తుండగా స్థానిక సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్లో వారిని సీఐ, ఎస్ఐల బృందం మంగళవారం ఉదయం అరెస్ట్ చేసింది. కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులు ప్రకటించారు. నాన్న కోసం..! ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన ప్రశాంత్ బాబుకు ఏకైక కుమారుడు పి.సుజిత్. డిగ్రీ వరకు చదివాడు. ప్రశాంత్‌బాబు అనారోగ్యం బారిన పడడంతో చేసిన వైద్యపరీక్షల్లో గుండె వాల్వులు చెడిపోయాయని తేలింది. దీంతో డాక్టర్లు గుండెకు స్టంట్ ఏర్పాటు చేశారు. సుజిత్ చేసిన అప్పులకు తోడు తన తండ్రి గుండె ఆపరేషన్‌కు చేసిన అప్పులు తీర్చడం భారమయ్యాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్ ఉద్యోగం పొందాడు. వచ్చే జీతంతో అప్పులు తీర్చలే క, మద్యం దుకాణం సొమ్ముపై కన్నేశాడు. చోరీకి స్కెచ్ వేసి, చివరకు అరెస్టయి, తన స్నేహితుడిని కూడా కటకటాల పాల్జేశాడు. -
తుపాకీతో దుండగుల హల్చల్
నల్లగొండ జిల్లాలో ఘటన... సినీఫక్కీలో దుండగుల పరార్ తుర్కపల్లి : నల్లగొండ జిల్లాలో బుధవారం దుండగులు తుపాకీ చూపించి హల్చల్ సృష్టించారు. అనంతరం పోలీసుల కళ్లుగప్పి సునాయూసంగా తప్పించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కీసర వైపు నుంచి వస్తున్న డీసీఎం వాహనాన్ని దుండగులు స్కూటీపై వెంబడించి తుర్కపల్లి మాదాపూర్ వద్ద ఓవర్ టేక్ చేసి తుపాకీతో రోడ్డు మీద అడ్డంగా నిలుచున్నారు. దీంతో భయాందోళన చెందిన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తుర్కపల్లి వైపునకు వెళ్లాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత టీఆర్ఎస్ మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తోంది. అక్కడ ఎస్కార్ట్ పోలీసులు మాత్రం గేటు బయట నిలబడి ఉండడంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని నిలిపి జరిగిన విషయాన్ని అక్కడి పోలీసులకు తెలిపాడు. అక్కడికి వచ్చిన దుండగులు పోలీసులను చూసి కంగుతిన్నారు. వెంటనే హైదరాబాద్ వైపు స్కూటీని మళ్లించి పరారయ్యారు. పోలీసులు భయపడ్డారా?: దుండగులను సునాయసంగా పట్టుకునే ఆవకాశం ఉంది. అయితే వారి వద్ద తుపాకీ ఉండడంతో భయపడి పోలీసులు పట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే దారిలో బొమ్మల రామారం, కీసర పోలీసులకు సమాచారం అందించినా దుండగులు దొరికే ఆవకాశం ఉండేది. సమాచారం అందించిన డీసీఎం డ్రైవర్ వివరాలు కూడా పోలీసుల వద్ద లేకపోవడం గమనార్హం.