breaking news
Troubling
-
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
చిక్కుల్లో మాల్యా అమెరికా కంపెనీ
న్యూయార్క్: భారత్‌లో వేల కోట్ల రుణాలను ఉద్దేశపూర్వంగా ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యా అక్రమాల ప్రభావం అమెరికాలోని అతని మద్యం వ్యాపారంపైనా పడింది. మాల్యా ఆర్థిక నేరాలపై న్యాయ విచారణ జరుగుతున్న నేపధ్యంలో అమెరికాలో అతని మద్యం వ్యాపార కంపెనీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇటీవల ఉదంతాలతో యూబీ గ్రూప్ పెను చిక్కులను ఎదుర్కొంటోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మెన్ డోసినో బ్రేవరేజెస్ కంపెనీ పేరిట మాల్యా ప్రారంభించిన లిక్కర్ వ్యాపారం మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. దీంతో కంపెనీ మనుగడను కొనసాగించేందుకు మాల్యా సొంత హామీ మేరకు బ్యాంకుల నుండి ఒక మిలియన్ డాలర్ల బ్రిడ్జిలోన్ పొందారు. ఈ మేరకు యుబిహెచ్ఎల్ బోర్డు డైరెక్టర్లు ఈ త్రైమాసికంలో ఒక మిలియన్ బ్రిడ్జిలోన్లను ఇచ్చేందుకు అనుమతిచ్చారు. మెన్ డోసినో బ్రేవింగ్ కంపెనీకి చైర్మన్, అత్యధిక వాటాలు కలిగిన హక్కుదారుగా ఉన్న విజయ్ మాల్యాపై భారత్‌లో అతని అక్రమాలపై న్యాయ విచారణ జరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రభావం ఈ కంపెనీపై పడనుంది. మాల్యా సొంత హామీతో యునైటెడ్ బ్రౌసింగ్ హోల్డింగ్ లిమిటెడ్, ఇతర ఆర్థిక సంస్థల నుండి భారీగా రుణ సదుపాయం పొందారని కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా అమెరికాలో ఈ విధంగా ఒక లిక్కర్ కంపెనీ డిఫాల్టర్ నోటీసు అందుకోవడం ఇది తొలిసారని తెలుస్తోంది. అలాగే యుఎస్ మార్కెట్లోని రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఇసి)కి సదరు మాల్యా కంపెనీ సమర్పించిన నివేదిక ప్రకారం కాగా యుబిహెచ్ఎల్ అమెరికాలోని మాల్యా కంపెనీకి నిర్వహణ వ్యయం కోసమే రుణం మంజూరు చేసింది. అమెరికాలోని మాల్యా కంపెనీ ఈ త్రైమాసికంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం సంస్థకు 2016, మార్చి 31 నాటికి 16 మిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉందని, అలాగే అప్పుడు 18 మిలియన్ డాలర్ల మేరకు ఉన్నట్లు తెలియజేసింది. అలాగే ఈ త్రైమాసికంలో సంస్థాగతంగా రికార్డు స్థాయిలో 6.9 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు జరిగినా, మొత్తం 637,100 డాలర్ల మేర నికర నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. కాగా మాల్యా అమెరికాలోని ఈ కంపెనీకి చెందిన రుణ చెల్లింపులను 2015 నుండి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 1.7 కోట్ల మేర చెల్లించారు. ఈ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాల్యా కింగ్ ఫిషర్ ప్రీమియం లీగ్ పేరిట మద్యం వ్యాపారాన్ని వివిధ దేశాల్లో కొనసాగిస్తున్నారు. బీర్ బ్రాండ్లలో మాల్యా కంపెనీ ఎంతో ప్రాచుర్యం పొందింది.