Traitor comments
-
‘షిండేపై గతంలోనూ దేశద్రోహి వ్యాఖ్యలు చేశారు కదా!’
ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట ఇచ్చింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యల కేసులో తాము తుది ఆదేశాలిచ్చేదాకా కమ్రాను అరెస్ట్ చేయొద్దంటూ బుధవారం ఆదేశాలు వెలువరించింది. కునాల్ కమ్రా వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఓ షోలో షిండేను ఉద్దేశించి పేరడీ సాంగ్ పాడే క్రమంలో ‘దేశద్రోహి’ అంటూ కునాల్ కమ్రా వ్యాఖ్యానించిన సంగతి తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగానూ ఖర్ పీఎస్‌లో కమ్రాపై కేసు నమోదు అయ్యింది. అయితే.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ కోత్వాల్, ఎస్ మోదాక్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.అయితే.. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అనే వ్యాఖ్యలు కేవలం కునాల్ కమ్రా ఒక్కరే చేయలేదని, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలు ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ వ్యాఖ్యలు చేశాయని(అప్పట్లో అజిత్ పవార్, ఉద్దవ్ థాక్రేలు షిండేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు), అయినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించలేదని కమ్రా తరఫు న్యాయవాది నవ్రోజ్ సీర్వై వాదించారు. కానీ, ఈ కేసులో కావాలనే తన క్లయింట్, అతని తల్లిదండ్రుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అంతేకాదు.. రాజకీయ పార్టీల నుంచి కునాల్‌కు బెదిరింపులు వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. పలు షోలలో కునాల్ కమ్రా ఇదే తరహాలో రాజకీయాలపై, రాజకీయ నేతలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడమూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే.. కునాల్ క్వాష్ అభ్యర్థనను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిటెన్ వేణేగావోంకర్ బెంచ్‌ను కోరారు. ఇదేం చతురతతో కూడిన విమర్శ కానేకాదని.. వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడమేనని వాదించారు. గతంలో ద్రోహి వ్యాఖ్యలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదనతో అంగీకరించిన పీపీ.. అలాగని ఇలాంటి వ్యవహారాలను చూస్తూ ఊరుకోకూడదన్నారు. అలాగే.. తనకు ప్రాణహాని ఉందని కునాల్ ముందుకు వస్తే భద్రత కలిగించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటిచింది. అంతకు ముందు ఇదే పిటిషన్‌పై విచారణ సందర్భంగా కునాల్‌కు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట అందించిన సంగతి తెలిసిందే. -
Madhya Pradesh: ఇప్పుడా ద్రోహి లేడు.. దిగ్విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శనివారం ఆయన రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ద్విగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ‘మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర సింధియా లేడు. కాబట్టి ద్రోహి లేడు’ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లోని దాతియాలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ సింధియాపై 'ద్రోహి' అంటూ విరుచుకుపడ్డారు. సింధియా తనతో ఎమ్మెల్యేలతో కలిసి 2020 మార్చిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత, దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ కూడా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పారు. -
ఆ సీఎం.. వెన్నుపోటు పొడిచారు!
బిహార్ గడ్డమీద.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పేరు ప్రస్తావించకుండానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా పట్నాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె నిప్పులు కురిపించారు. వెన్నుపోటు పొడిచేవాళ్ల గురించి తాను ఎక్కువ మాట్లాడబోనన్నారు. పెద్దనోట్ల రద్దును బిహార్ సీఎం నితీష్ కుమార్ సమర్థిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు బినామీ ఆస్తులపై కూడా కొరడా ఝళిపించాలని ఆయన గట్టిగా అడుగుతున్నారు. ఈ విషయాన్నే ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ అంతకుముందు తమతో కలిసి అన్ని విషయాల్లో కేంద్రప్రభుత్వంపై పోరాడిన సీఎం.. ఇప్పుడు ఇలా చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిహారీ వలస కార్మికులకు పనులు లేక అల్లాడుతున్నారని, తిండి కోసం దేశమంతా తిరుగుతున్నారని, అలాంటి సమయంలో వాళ్లకు నాయకులు మద్దతుగా నిలవాలని అన్నారు. బిహార్ పర్యటనకు వచ్చిన తనుకు స్వాగతం పలికేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక సీనియర్ మంత్రిని కూడా పంపలేపదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గతవారం ఆమె లక్నోలో పెద్దనోట్ల రద్దుపై ర్యాలీ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. తన మంత్రులతో కలిసి మమత ర్యాలీలో పాల్గొన్నారు. కానీ బిహార్‌లో మాత్రం ఆమెకు నితీష్ స్వాగతం లభించకపోవడంతో.. రాష్ట్ర అతిథిగా వచ్చినా కూడా సీఎంను కలవలేదు. దానికి బదులు ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆర్జేడీ నాయకుడు లాలుప్రసాద్ ఇంటికి మాత్రం వెళ్లి, అక్కడ ఆయన భార్య రబ్రీదేవిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. బిహార్ మంత్రివర్గంలో ఉన్న లాలు కొడుకులిద్దరు ఆమెను కలవలేదు, ర్యాలీలో పాల్గొనలేదు. పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడు మాత్రం ర్యాలీలో పాల్గొన్నారు.