breaking news
traitor
-
దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన సింధియా.. ‘ఆ స్థాయి నాది కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా. దిగ్విజయ్ ఎన్ని మాటలు అన్నా.. సింధియా కుటుంబ స్థాయిని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. డిగ్గీ స్థాయికి దిగి తాను అలాంటి మాటలు అనలేనని సింధియా తేల్చి చెప్పారు. (చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య) ఇంతకీ దిగ్విజయ్ ఏం అన్నారంటే.. రఘోఘర్ లో శనివారం రాత్రి జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో జోతిరాధిత్య సింధియా ఓ ద్రోహి అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దోహులే అన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరుసటి రోజు సింధియా స్పందిచారు. 'అలా మాట్లాటడం ఆయనకు అలవాటే. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను' అని సింధియా పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు సింధియా. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు వీలు చిక్కినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు!) -
రైతు ఉద్యమానికి కేసీఆర్ మద్దతు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా మిగిలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ ఎంపీలు కనీసం రైతులకు సంఘీభావం తెలపలేదని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని కిసాన్ సంసద్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సహా 15 విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. రైతుల ధర్నాకు కేసీఆర్ ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఏ విషయంలో అయినా కేసీఆర్, ప్రధాని మోదీ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ తెస్తున్న చట్టాలకు కేసీఆర్ మద్దతు పలుకుతూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే, వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయ చట్టాలను చేసి కేంద్రం రైతులను మోసం చేసినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏక వాక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. -
ఖడ్సే ఓ దేశద్రోహి:అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దావుద్ ఇబ్రహీంతో సంభాషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి ఎక్నాథ్ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే సమయంలో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాటిదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయకపోయినప్పటికీ హార్దిక్ పటేల్ దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ దావుద్ ఇబ్రహీంతో ఖడ్సే మాట్లాడినట్లు కాల్ రికార్డులు దొరికినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. హార్దిక్ పటేల్ ఏ విధంగా దేశదోహి? దేశద్రోహులు ఖడ్సే లాంటి నాయకులే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీటర్లో శనివారం వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. హార్దిక్‌పై దేశద్రోహం కింద అభియోగాలు మోపటంపై గుజరాతీయులు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. లక్షలాది గుజరాతీయుల గొంతును మాత్రమే ఆయన వినిపించారని చెప్పారు.పటేల్‌ను దేశద్రోహి అంటే గుజరాతీయులందర్నీ అన్నట్లేనన్నారు. -
'రాహుల్ ను ఉరి తీయాలి, లేదా కాల్చి చంపాలి'
జైపూర్: జేఎన్‌యూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వివాదం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తాజాగా రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ చౌదరి... రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూలో దేశద్రోహులకు మద్దతు పలుకుతున్న రాహుల్ ఒక విద్రోహి అని వ్యాఖ్యానించారు. రాహుల్ ను ఉరి తీయాలి లేదంటే..కాల్చి చంపాలంటూ మండిపడ్డారు. బైతూ అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యే కైలాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. అఫ్జల్ గురుని దేశభక్తుడిగా కీర్తిస్తూ, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ద్రోహులను సమర్ధించిన రాహుల్ దేశంలో వుండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కాగా జేఎన్‌యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలన్న ఓ న్యాయవాది పిటిషన్ ను అలహాబాద్ విచారణకు స్వీకరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. -
ఈ మహా యోధుడూ దేశద్రోహేనా?
అవలోకనం టిప్పు వంటి యోధానుయోధుల గురించి చదవడానికి, చదివిన తర్వాత వారిపై ఏదైనా రాయడానికి, వ్యాఖ్యానించడానికి మనకు ఏమాత్రం మనస్కరించదు. కానీ వారి గురించిన నానా చెత్త విషయాలను మాత్రం మనం ఎల్లపుడూ నమ్మేందుకే ఇష్టపడుతుంటాం. పైగా మనకు అతి కొద్దిగా తెలిసిన విషయాలపై నిరసన తెలిపేందుకే మనం సిద్ధమవుతుంటాం కూడా. పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కొన్ని వారాల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకోసం బెంగళూరుకు వచ్చారు. ఆ కార్యక్రమంలో నేనూ భాగస్వామి నయ్యాను. ఆయన నాకు గతంలోనే తెలుసు. దక్షిణ భారత్‌లో ఆయన ఏం చూడ దల్చుకున్నారని అడిగాను. (బెంగళూరును సందర్శించడానికి అనుమతి పొందిన మొదటి లేదా రెండవ పాకిస్తానీ హై కమిషనర్ బహుశా ఆయనే కావచ్చు. నగరంలోని టెక్నాలజీ పార్కులను చూడాలనుకుంటున్నట్లు, అలాగే మైసూరుకు వెళ్లాలని ఉందని కూడా ఆయన చెప్పారు. బెంగళూరు నుంచి మైసూరుకు రెండు గంటల ప్రయాణం. అక్కడ మైసూరుకు వెలుపల ఉన్న శ్రీరంగపట్నంలోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూడాలన్నది ఆయన కోరిక. భారతీయులందరూ టిప్పును చూసి గర్వించాలని బాసిత్ అభిప్రాయం వెలిబుచ్చారు. కాని ఇటీవలి పరిణా మాలు చూస్తుంటే ఆయన అభిప్రాయం తప్పు కావచ్చు. టిప్పు జయంతి వేడుకలను నిర్వహించే విషయమై చెలరేగిన గొడవల్లో.. గత వారం కర్ణాటకలో ఇద్దరు మరణించారు. నేడు భారత్‌ను తీవ్రంగా నిస్పృహకు గురిచేస్తున్న అనేక అంశాల్లో హిందూ-ముస్లిం సమస్య ఒకటి. మనదైన ప్రపంచం లో చక్రవర్తులను మంచివారు (అశోకుడు, అక్బర్ తదితరులు), చెడ్డవారు (ఔరంగజేబు, టిప్పు సుల్తాన్) అని వేరు చేసి చూస్తుంటారు. చరిత్రను వాస్తవం లేదా హేతువు దృష్ట్యా కాకుండా భావోద్వేగాల బట్టి మాత్రమే చూస్తున్న దేశంలో సమాజపు నిర్దిష్ట స్వభావం ఇలాగే ఉంటుంది. పైగా ఇది దాదాపు నిరక్షరాస్యులు, లేదా ఒక మేరకు చదువుకున్న ప్రజలకు ఇది సంకేతంగా కూడా. టిప్పు, ఆయన సైనికాధిపతులపై ప్రశంసలు కురిపించడం అనేది వారిపట్ల వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా జిహాద్లో నిరంత రం మునిగి తేలిన వ్యక్తిగా టిప్పును ఇప్పుడు చిత్రిస్తున్నారు. ఇది నిజంగానే బూటకమైంది. అయితే ఈ విషయాన్ని నేను ఇక్కడ నిరూపించడానికి ప్రయత్నిం చబోను. టిప్పు మీద వచ్చిన పుస్తకాలను చదివి, సమాధానపడి తర్వాత మీమీ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది. అయితే ఇక్కడ సమస్యల్లా ఏమిటంటే నాగ రిక ప్రపంచంలో వలే కాకుండా ఇండియాలో చరిత్రకు సంబంధించి చాలా తక్కు వ పుస్తకాలే రాయడం జరిగింది. స్మృతులను రాసి ఉంచడం, దినచర్యను రాసి ఉంచుకునే సంప్రదాయం మనకు లేదు. గత చరిత్రలోని వ్యక్తులు, ప్రముఖులపై కొత్త రచనలు చేయడంలో మనకు ఎలాంటి ఆసక్తీ లేదు కూడా. అందుకే టిప్పుపై భారతీయులు రాసిన పుస్తకాలేవీ మనకు కనిపించవు. టిప్పు గురించి ఏదయినా తెలుసుకోవాలంటే 19వ శతాబ్ది నాటి ‘హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ అండ్ ది స్ట్రగుల్ ఆఫ్ ది ముస్లిమన్ పవర్స్ ఆఫ్ ది సౌత్’ వంటి పుస్తకాలను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. దీన్ని రాసింది లూయిస్ బౌరింగ్ (సెయింట్ మార్క్ రోడ్ లోని బౌరింగ్ క్లబ్ ద్వారా బెంగళూరు ప్రజలకు ఇతడు సుపరిచితుడే). టిప్పుకు సంబంధించినంత వరకు రెండు లేదా మూడు అంశాలు నాకు ఎంతో ఆసక్తిగొలుపుతుంటాయి. మొదటిది: ఇంగ్లీష్ వారికి టిప్పు కొరకరాని కొయ్యగా మారాడు. ఆ కాలానికి సంబంధించి మన చిట్టచివరి, మహా చరిత్రకా రుల్లో ఒకరైన సర్ జాదూనాథ్ సర్కార్ రచనలను గానీ మనం చదివినట్లయితే, మారాఠాల లాగా కాకుండా టిప్పు నిజమైన యోధుడిగా ఉండేవాడని మనకు స్పష్టమవుతుంది. పానిపట్ యుద్ధంలో పరాజయం తర్వాత మరాఠాలు కుప్పకూ లిన చరిత్రను టిప్పు వీరోచిత ప్రతిఘటనను పోల్చి చూస్తే మనకు విషయం స్పష్ట మవుతుంది. కేవలం 40 సంవత్సరాల్లోపే.. అంటే 1761 (పానిపట్ యుద్ధంలో అహ్మద్ అబ్దాలీ గెలుపొందిన సంవత్సరం) నుంచీ 1799లో టిప్పు యుద్ధంలో నేలకూలిన కాలంలోనే ఇదంతా జరిగింది. ఈ కొద్ది సంవత్సరాల కాలంలోనే బ్రిటిష్ వారు తమ శత్రువులందరినీ ఓడించివేశారు. పంజాబ్ మాత్రమే వారికి కొరుకుడు పడకుండా మిగిలిపోయింది. ఆపై కొన్ని దశాబ్దాల అనంతరం రంజిత్ సింగ్ మరణం తర్వాత పంజాబ్ సైతం కుప్పగూలిపోయింది. బ్రిటిష్ పాలకులకు నిజమైన ప్రతిఘటనను ఇచ్చింది టిప్పుమాత్రమే. ఒక సాటిలేని సేనాధిపతిగా, భౌగోళిక రాజకీయాలను (బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్‌వారిని నిలపడం) సమయస్ఫూర్తితో అవగాహన చేసుకున్న టిప్పుకు యుద్ధానికి సంబంధించినంత వరకు ఆధునిక దృక్పథం ఉండేది. రెండవది : యుద్ధంలో రాకెట్లను తొలిసారి ప్రయోగించినది టిప్పు సైన్యమే అనేది జగమెరి గిన సత్యం. ఈ ముతక రాకెట్లకు టిప్పు సైనికులు కత్తులను జోడించి శత్రు సైన్యం పైకి ప్రయోగించేవారు. బ్రిటిష్ చరిత్రలోనే మేటి సేనాని అర్థర్ వెలస్లీ (డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్) చివరకు టిప్పును ఓడించగలిగాడు. వాటర్లూ యుద్ధంలో నెపోలి యన్ను పరాజితుడిని చేసింది కూడా వెలస్లీయే. సైనికపరంగా, జాతీయవాదపరంగా టిప్పు ఆనాడు సాధించిన మేటి విజ యాలను ఈరోజు అంత సులువుగా నిర్లక్ష్యం చేయడం నన్ను ఎంతగానో నిస్పృహ కు గురి చేస్తోంది. ఇది నిజమైనా, నిజం కాకపోయినా అతడు హిందువులను వధించాడు లేక మతమార్పిడికి గురిచేశాడు అనే భావనను మాత్రమే నేడు గుర్తుం చుకోవడం నిజంగా విషాదకరం. మనందరం గుర్తుంచుకోవలసిన విషయం ఏమి టింటే, అశోక చక్రవర్తి కళింగ రాజ్యాన్ని జయించినప్పుడు అతడు విదేశీయులను, ముస్లింలను ఊచ కోత కోయలేదు. మనకు చరిత్ర అందించిన పాఠాల మేరకు అశోకుడు ఒరియా మాట్లాడే వేలాదిమంది హిందువులను ఊచకోత కోశాడు. అయినప్పటికీ అశోకుడిని మహా వ్యక్తిగా పిలుస్తుంటాం. అతడి రాజచిహ్నమైన సింహం గణతంత్ర భారత్ అధికారిక చిహ్నమైంది. భారతీయ పతాక మధ్యలోని చక్రాన్ని అశోక చక్రం అని పిలుస్తారు. ఎందుకంటే అది కూడా అతని చిహ్నమే. ఈ ఇద్దరూ ఒకే నేరం చేశారని ఆరోపణలు మిగిలి ఉండగా మనం టిప్పును కాకుండా అశోకుడిని మాత్రమే ఎందుకు గౌరవిస్తున్నాం? మనకు సమాధానం తెలుసు. అది చాలా స్పష్టమైనదే. భారత్‌లో ఒక హిందువు చేసిన పనులు ఒక ముస్లిం రాజు చేయకూడదంతే.. అద్భుతమైన పాటియాలా రాజప్రాసాదాన్ని స్థాపించినవాడు మహారాజా అలా సింగ్. తన జీవిత కాలంలో ఇతడు సాధించిన సైనిక విజయాలేమీ లేవు. అతడు సాధించిన ఘనత ఏమిటంటే మరాఠాలను ఓడించడంలో అతడు అబ్దాలీకి సహకరించడమే. దీనికి గాను ఇతడు ఆప్ఘన్ రాజు గౌరవ పురస్కారాలను అందుకున్నాడు. కానీ అలా సింగ్‌ను కాని అతడి వారసులను భారత్‌లో ఎవరయినా ద్రోహులుగా చూస్తున్నారా? పైగా పాటియాలా రాజులు మహారాజా రంజిత్ సింగ్‌ను నిరంతరం ప్రతిఘటిస్తూ వచ్చారు. కానీ వారిని ఎవరూ జాతి వ్యతిరేకులుగా చూడటం లేదు. ముస్లిం రాజులకు మాత్రమే ఈ విధమైన ‘గౌరవం’ లభిస్తూంటుంది మరి. టిప్పు వంటి యోధానుయోధుల గురించి చదవడానికి, చదివిన తర్వాత వారిపై ఏదైనా రాయడానికి, వ్యాఖ్యానించడానికి మనకు ఏమాత్రం మనస్కరిం చదు. కానీ వారి గురించి నానా చెత్త విషయాలను మాత్రం మనం ఎల్లపుడూ నమ్మేందుకే ఇష్టపడుతుంటాం. పైగా మనకు అతి కొద్దిగా తెలిసిన విషయాలపై నిరసన తెలిపేందుకే మనం ఎల్లప్పుడు సిద్ధమవుతుంటాం. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త రచయిత, కాలమిస్టు aakar.patel@icloud.com)