breaking news
top places
-
‘ఫార్చూన్’ బిజినెస్ పర్సన్.. నాదెళ్ల
శాన్ ఫ్రాన్సిస్కో: తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్–2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగిపోయిన ఆయన.. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకుపోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్ మ్యాగజైన్ ఈ సందర్భంగా కొనియాడింది. తాజాగా 10 బిలియన్ డాలర్ల పెంటగాన్ క్లౌడ్ కాంట్రాక్టును అందుకోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని స్వయంగా ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పినట్లు వివరించింది. బిల్ గేట్స్ వలే వ్యవస్థాపకుడు, స్టీవ్ బాల్మెర్ వంటి సేల్స్ లీడర్ కాకపోయినప్పటికీ.. 2014లో ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నిక జరిగింది. ఇటీవలే ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన 10 అగ్రశేణి కంపెనీల సీఈఓల జాబితాలో నాదెళ్ల కూడా ఉన్నారు. బంగాకు 8వ స్థానం: ఫార్చూన్ జాబితాలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 8వ స్థానంలో ఉండగా.. కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలి చారు. 2వ స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయినెస్, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓ బ్రియాన్ నికోల్ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్ సీఈఓ మార్గరెట్ కీనే (4), ప్యూమా సీఈఓ జోర్న్ గుల్డెన్ 5వ స్థానంలో నిలిచారు. -
అమెరికా అదరహో...
పతకాల వేటలో ముందంజ రియో డి జనీరో: వరుసగా నాలుగోరోజు ఆధిపత్యం కనబరిచిన అమెరికా క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. 10 స్వర్ణాలతో కలిపి మొత్తం 27 పతకాలతో ఒంటరిగా అమెరికా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ రోడ్ ఈవెంట్స్‌లో అమెరికా ఆటగాళ్లు పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాథ్లీన్ లెడెకీ (అమెరికా) ఒక నిమిషం 53.73 సెకన్లలో రేసును ముగించి రియోలో రెండో స్వర్ణాన్ని సాధించింది. మహిళల సైక్లింగ్ వ్యక్తిగత టైమ్ ట్రయల్‌లో క్రిస్టిన్ ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా) పసిడి పతకాన్ని గెలిచింది. జిమ్నాస్టిక్స్‌లో అ‘మెరిక’న్స్ మహిళల ఆర్టిస్టిక్ టీమ్ ఈవెంట్లో అమెరికా జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. లండన్ ఒలింపిక్స్‌లోనూ పసిడి నెగ్గిన అమెరికా అదే ఫలితాన్ని రియోలోనూ పునరావృతం చేసింది. సిమోన్ బైల్స్, గాబ్రియెలా డగ్లస్, లారెన్ హెర్నాండెజ్, మాడిసన్ కొసియన్, అలెగ్జాండ్రా రైస్మన్లతో కూడిన అమెరికా జట్టు 184.897 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రష్యా (176.688 పాయింట్లు) రజతం నెగ్గగా... చైనా (176.003 పాయింట్లు) ఖాతాలో కాంస్యం చేరింది. కటింకా మూడోసారి... గత మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయిన హంగేరి మహిళా స్విమ్మర్ కటింకా హొసజు రియో ఒలింపిక్స్‌లో మాత్రం చెలరేగుతోంది. వరుసగా మూడో స్వర్ణంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. బుధవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో కటింకా 2 నిమిషాల 06.58 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. కటింకా ఇప్పటికే 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌లో స్వర్ణాలు సాధించింది. సెరెనాకు షాక్ మహిళల సింగిల్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలని ఆశించిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా మూడో రౌండ్లో 4-6, 3-6తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. సెరెనా ఓటమితో మహిళల, పురుషుల సింగిల్స్ ఈవెంట్స్‌లో టాప్ సీడ్స్ పోరాటం ముగిసినట్టయింది. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే.