breaking news
To top
-
టెస్టుల్లో టాప్‌లోనే...
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 115 పారుుంట్లతో టాప్‌లో ఉండగా... పాకిస్తాన్ (111), ఆస్ట్రేలియా (108) తర్వాతి స్థానాల్లో ఉన్నారుు. ఇంగ్లండ్ నాలుగో ర్యాంక్‌లో ఉంది. ఇక బౌలర్ల విభాగంలో అశ్విన్ కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 900 పారుుంట్లు ఉండగా... దక్షిణాఫ్రికా పేసర్ స్టెరుున్ 878 పారుుంట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో కూడా అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌లో రహానే ఒక్కడే (ఆరో ర్యాంక్) భారత్ నుంచి టాప్-10లో ఉన్నాడు. ఈ విభాగంలో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) టాప్‌ర్యాంక్‌లో ఉన్నాడు. -
‘ఫిష్ బౌల్’గా తెలంగాణ
కాచిగూడ: ప్రభుత్వ సహాయ, సహకారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఫిష్బౌల్’గా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిరంతరం కృషి చేస్తోందని మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. గురువారం నారాయణగూడలోని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహాసభ గౌరవ అధ్యక్షులు రోటం భూపతి, ప్రధానకార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్‌ముదిరాజ్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4612 వందల ఎకరాల్లోని 88 రిజర్వాయర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 19,650 చెరువులు, కుంటల్లో రూ.53 కోట్ల మత్స్య సీడ్స్‌ను పంపిణి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తోందన్నారు. చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పర్యటించి కేజ్‌కల్చర్ విధానాన్ని పరిశీలించి ప్రయోగాత్మకంగా తెలంగాణలో ప్రవేశపెట్టారన్నారు. మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉన్న రిజర్వాయర్లు, కుంటలు, చెరువులకు ఉచితంగా చేపలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ అధ్యయన వేదిక చైర్మ ప్రొఫెసర్ నీలా రాములు, మహాసభ ప్రతినిధులు పోలు నరేష్, గుర్రాల మల్లేష్, చింతల ప్రకాష్, పల్లెబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.