రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం టౌన్ : కైకలూరు–పల్లెవాడ మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భీమవరం రైల్వే పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుని వయస్సు 40–45 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు 5.4 అడుగులు ఉన్నాడని పేర్కొన్నారు. తెలుపు రంగు శరీర ఛాయ కలిగి, బిస్కెట్ కలర్ ఫ్యాంటు, ఎరుపురంగు పొడవు చేతుల చొక్కా ధరించి ఉన్నాడని వివరించారు. ఛాతి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.