breaking news
today bundh
-
నేడు రోడ్ల దిగ్బంధం
- బ్యాంకులు, ఏటీఎంలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు - వామపక్ష పార్టీల నాయకులు అనంతపురం అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి నిరసనగా సోమవారం రోడ్ల దిగ్బంధం చేపట్టామని, ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని జయప్రదం చేయాలని వామపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, ఏటీఎంలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.జాఫర్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాబై రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని ప్రధాని చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఆరు నెలలు గడిచినా సాధారణ స్థితి కొనసాగవచ్చని అంచనాలు వేస్తున్నారని అన్నారు. త్వరలో ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలలో ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన మోదీ ఎత్తుగడ తిరగబడిందన్నారు. ఈ చర్యతో ప్రధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. విదేశీ బ్యాంకుల్లోని రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మోదీ ఆ దిశగా చర్యలు చేపట్టకుండా సంపన్నులు, కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హోదాపై నేడు బంద్ హోరు
విజయవంతానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు, వైఎస్ఆర్సీపీ పిలుపునకు అనూహ్య స్పందన మద్దతు ప్రకటించిన వామపక్షాలు కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా దగా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో బంద్ విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ తీరుపై ఆగ్రహంతో ఉన్న అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకతను దిల్లీ వరకు చాటి చెప్పాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాయి. హోదాతోనే భవిష్యత్తు తరాలకు వెలుగు, పారిశ్రామికీకరణతో ముందడుగు వేయగలం, అప్పుల బారిన పడకుండా రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిత చేకూరగలదని, ప్రాజెక్టులకు ఓ రూపు వస్తుందనే అంశాలను ప్రజలకు వివరించడానికి పార్టీ నేతలు తమ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో సమావేశాలు నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. మండలం, గ్రామ స్థాయిలో కూడ ప్రజలను చైతన్యం చేసే దిశలో కార్యకర్తలు శుక్రవారం ప్రతర్శనలు చేశారు. ఉదయాన్నే ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేయడం నుంచి వ్యాపార, వాణిజ్య వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బంద్‌లో పాల్గొనేలా ఆయా సంస్థలతో చర్చించారు. మరో వైపు వామపక్ష పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్‌ను విజయవంతం చేయండి: కన్నబాబు బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు, ధియేటర్ల యాజమాన్యాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనను నిరసిస్తూ చేపట్టిన బంద్‌లో అన్ని వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ప్రజలను మభ్యపెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న కపట నాటకాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.