breaking news
ticketless travel
-
టికెట్ లేని ప్రయాణికులపై రూ.300 కోట్లు వసూలు.. 90% యువతే
ముంబై: ముంబైకర్లకు లైఫ్‌లైన్‌గా సేవలందిస్తున్న లోకల్ రైళ్లలో టికెటు లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గతేడాదికాలంలో టికెటు లేకుండా ప్రయాణిస్తున్న 46.32 లక్షల మందిని పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా రూ.300 కోట్లకుపైగా జరిమాన వసూలు చేశారు. ఇందులో ఒక్క ముంబై రీజియన్‌లోనే 19.57 లక్షల మందిని పట్టుకోగా వారి నుంచి రూ.108 కోట్లు జరిమాన వసూలు చేశారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరోపక్క ఇదే తరహాలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో లోకల్ రైళ్ల ఆదాయానికి భారీ నష్టాన్ని కలగజేస్తున్నారు. ముంబైలో లోకల్ రైళ్లలో నిత్యం సుమారు 70 నుంచి75 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అందులో 70% ప్రయాణికులు సీజన్ పాస్ హోల్డర్లుంటారు. మిగతావారు టికెట్ తీసుకుని లేదా టికెట్ లేకుండా ప్రయాణించే వారుంటారు. 2022–23 ఆర్థికక సంవత్సరంలో సెంట్రల్ రైల్వే టీసీలు దాడులుచేసి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 46.32 లక్షల మందిని పట్టుకున్నారు. ఇందులో 20 మంది టీసీలు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రూ.కోటికిపైనే జరిమాన వసూలు చేశారు. డి.కుమార్ అనే టీసీ 22,847 మందిని పట్టుకుని రూ.2.11 కోట్లు జరిమాన వసూలుచేసి అగ్రస్థానంలో నిలిచారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకునేందుకు రైల్వే టీసీలు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అందులో పెద్ద సంఖ్యలో పట్టుబడుతుంటారు. పట్టుబడిన వారిలో 90% యువతీ యువకులే ఉన్నారు. టీసీలను దూరం నుంచి చూపి తప్పించుకుని పారిపోయిన వారి సంఖ్య కూడా దాదాపు ఇంతే సంఖ్యలో ఉంటుంది. వీరంతా టీసీలకు చిక్కితే రైల్వేకు భారీగా అదనంగా ఆదాయం రావడం ఖాయమని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
Viral Video: టికెట్ లేకుండా దొరికాడు.. ఆపై మన్‌కీబాత్‌తో ముంబైనే కదలించాడు!
ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది అంటుంటారు పెద్దలు. అలాగే ముంబై మొత్తాన్ని ఆ ఒక్కడి వీడియో కదిలించింది. ‘టికెట్ లేని ప్రయాణం నేరం’ అనే ఆదేశాలకు తలొగ్గిన ఆ యువకుడు.. తనలాంటి వేలమంది ఆవేదనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ నిలదీశాడు. ఆ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ కావడంతో వేలమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ముంబై: మహానగరం.. జూన్ చివరివారంలో ఒక రోజు. లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ఆ యువకుడ్ని.. పరేల్ స్టేషన్ వద్ద టీసీ దొరకబట్టాడు. టికెట్ లేదని, పైగా అనుమతి లేకున్నా రైళ్లో ప్రయాణిస్తున్నాడని ఛలానా రాయబోయాడు. ఆ యువకుడు బతిమాలడమో, లేదంటే పారిపోవడమో లాంటి ప్రయత్నాలు చేయలేదు. సరాసరి టీసీ వెంట ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ తనకు విధించిన ఫైన్‌ను కట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు. కానీ, ఆ ఘటనంతా సెల్ఫోన్లో రికార్డ్ చేస్తుండగా.. అధికారులు సైతం అడ్డుచెప్పలేదు. ‘‘ఒకప్పుడు నెలకు 35 వేల రూపాయలు సంపాదించేవాడ్ని. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం పోయింది. ఖర్చులన్నీ పోనూ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 400రూ. చేరింది. ఈ మధ్యే జాబ్ దొరికింది. వెళ్లాలంటే రైలు మార్గం తప్ప నాకు వేరే దిక్కులేదు. కానీ, రెండో రోజే ఇలా టీసీకి దొరికిపోయా. టీసీ సాబ్ తన డ్యూటీ తాను చేశాడు. అలాగే ఫైన్ కట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, లాక్‌డౌన్‌తో నాకంటే దారుణమైన కష్టాలు పడుతున్నవాళ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. This situation is there with the youth now in Mumbai. Same story can be guessed for me & my fellow DJ's from the Entertainment Industry. The government should look into this very seriously..#LockDown #adityathackeray #mumbailocal @AUThackeray @UdhavThackeray @VijayWadettiwar pic.twitter.com/8pnqtHWPyu — Omkar Raut (@djomkar) June 27, 2021 ఇప్పుడు రోజూ రైళ్లలో నాలాంటి వందల మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్లే. కానీ, అది సరదా కోసం చేయట్లేదు కదా. కుటుంబాల్ని పోషించుకోవాలనే తాపత్రయంతోనే అలా చేస్తున్నారు. కరోనా.. లాక్డౌన్ ఇక చాలు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే సంపాదించుకోవడానికి అర్హులా? మాలాంటి వాళ్లకు రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వరా? దయచేసి ప్రభుత్వం ఆ నిబంధనల్ని ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు’’ అని మాట్లాడాడు ఆ యువకుడు. వెల్లువలా మద్దతు కరోనా కమ్మేసిన మహా నగరం ముంబైలో.. ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ వస్తోంది బీఎంసీ. అయితే లోకల్ ట్రైన్లను నడిపిస్తున్నా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాలేదు. అత్యవసర సర్వీసుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎమర్జెన్సీ కేటగిరీలో చేర్చిన ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో తనలాంటి వేల మంది ప్రైవేట్ ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబిస్తూ ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో సోషల్ మీడియా మొత్తం అతనికి మద్ధతుగా నిలుస్తోంది. ప్రైవేట్ వాహనాలకు రోజూ బోలెడు ఖర్చులు చేస్తున్నామని..భరించలేకపోతున్నామని కొందరు, ప్రభుత్వ ఉద్యోగుల వేళలు మార్చాలని మరికొందరు, గవర్నమెంట్ ఉద్యోగులతో కరోనా వ్యాపించదా?.. అందరికీ అనుమతులు ఇవ్వాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా సాకుతో సామాన్యుడికి లోకల్ రైలులో ప్రయాణాలపై ఆంక్షలు విధించిన అధికార యంత్రాగం.. బస్సు ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు. ఇలా ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్లో చర్చకు దారితీసింది. పరిష్కారం ఏమిటసలు? కరోనా మహమ్మారి భయం పూర్తిగా పోని తరుణంలో.. రైలు ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేయడం సరికాదనే అభిప్రాయంలో ఉన్నారు అధికారులు. లోకల్ రైళ్లలో గుంపులుగా ప్రయాణిస్తారు గనుకే ధైర్యం చేయడం లేదని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ చాహల్ వెల్లడించారు. అయితే త్వరలో ఆ ఆంక్షల్ని సడలిస్తామని, ముందుగా మహిళలకు, ఆపై మిగతా సెక్టారలకు ఒక్కో దశలో అనుమతులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: బాప్రే.. మాస్క్ లేకుండా నెలలో లక్షమంది!! -
ఆ రైలంతా టికెట్ లేని ప్రయాణికులే..
రామేశ్వరం : దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు టికెట్ లేకుండానే రైలు ప్రయాణం చేసేశారు. టికెట్ కౌంటర్లో ఉద్యోగులెవరూ లేకపోవటమే ఇందుకు కారణం. తమిళనాడులోని రామేశ్వరం- మదురై ప్యాసింజర్ ట్రెయిన్ నిత్యం ఉదయం 5.30 గంటల సమయంలో రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జనం స్టేషన్‌కు చేరుకుని కౌంటర్ వద్ద క్యూ కట్టారు. అయితే, రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతున్నా సంబంధిత ఉద్యోగులెవరూ లేకపోవటంతో ప్రయాణికులంతా రైలెక్కేశారు. గమ్యస్థానాలకు చేరుకున్నారు. టికెట్ కౌంటర్లో ఉండాల్సిన ఉద్యోగి రాకపోవటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయినట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. మధురై-రామేశ్వరం మధ్య దూరం 161 కిలోమీటర్లు కాగా బుధవారం రైలులో సుమారు వెయ్యిమంది ఉచితంగా ప్రయాణించినట్లు సమాచారం. -
టికెట్ తీయలేదు.. రూ. 3.32 కోట్లు కట్టారు!
రైల్లో టికెట్లు తీయనందుకు ఏకంగా రూ. 3.32 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. పశ్చిమరైల్వేలోని అహ్మద్‌నగర్ డివిజన్ పరిధిలో 2014 సంవత్సరంలోని తొమ్మిది నెలల కాలంలో మొత్తం 68 వేల కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసులకు కలిపి అధికారులు మొత్తం రూ. 3.32 కోట్ల జరిమానాలు విధించారు. అసలు టికెట్ లేనివాళ్లు, సరైన టికెట్ తీయని వాళ్ల దగ్గర నుంచి ఈ జరిమానాలు వసూలు చేశారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ మొత్తాలు వసూలయ్యాయి. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే పీఆర్వో ప్రదీప్ శర్మ ఓప్రకటనలో తెలిపారు.